Site icon HashtagU Telugu

Rajaiah : నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ..కడియం కు రాజయ్య సవాల్

Kadiyam Vs Rajayya

Kadiyam Vs Rajayya

స్టేషన్ ఘనపూర్ లో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. మొదటి నుండి ఘన్ పూర్ లో కడియం కు రాజయ్య (Thatikonda Rajaiah Vs Kadiyam Srihari) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలు ఉన్నాయి. కడియం బిఆర్ఎస్ లో చేరిన దగ్గరి నుండి ఇంకాస్త ఎక్కువయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టికెట్ విషయంలో ఇరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే అధిష్టానం కడియం కు టికెట్ ఇచ్చేసరికి రాజయ్య అసంతృప్తి తో బిఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఇప్పుడు కడియం బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లేసరికి..మళ్లీ రాజయ్య బిఆర్ఎస్ కు దగ్గరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

రీసెంట్ గా కేసీఆర్ ను కలవడం ..ఘనపూర్ బాధ్యతలు రాజయ్య కు అప్పగించడం తో ఇక తన దూకుడు పెంచారు. గత నాల్గు రోజులుగా కడియం ఫై విమర్శలు చేస్తూ వస్తున్న రాజయ్య..నేడు నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అంటూ కడియం ఫై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉప ఎన్నికల్లో నువ్వా? నేనా? చూసుకుందామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమపోరాటం మన ఇద్దరి మధ్యనేనని అన్నారు. దేశం మొత్తం అక్కడ రాజయ్య గెలుస్తాడా? లేక కడియం శ్రీహరి గెలుస్తాడా? అని మన ఇద్దరి కోసమే ఎదురుచూస్తున్నారు. అంటూ రాజయ్య.. కడియంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Read Also : Lok Sabha Polls 2024: మధ్యాహ్నం సమయానికి 50.96 శాతం ఓటింగ్