తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వలసల పర్వం ఇంకాస్త ఎక్కువ అవుతూనే ఉంది. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) తో పాటు కాంగ్రెస్ (Congress) పార్టీలలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ కి మరో షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు (Thati Venkateswarlu)..ఆ పార్టీ కి రాజీనామా చేసి , బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
అశ్వారావుపేట (Aswaraopeta) కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ తాటి వెంకటేశ్వర్లు.. పార్టీని వీడాలని భావిస్తున్నాడట. ఇదే తరుణంలో తాటి వెంకటేశ్వర్లుతో మంత్రి హరీష్ రావు మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. ఈరోజు కానీ రేపు కానీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతారని వినికిడి. 2014లో అశ్వారావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తాటి వెంకటేశ్వర్లు.. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆయన బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయాడు. ఆ తరువాత తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ వస్తుందని భావించిన..కాంగ్రెస్ మాత్రం ఈయనకు కాకుండా అది నారాయణకు ఇచ్చారు.
Read Also : Ponguleti : మూడు రోజుల్లో నాపై ఐటీ దాడులు..ప్రచారంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు