CM Revanth: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడ్డం ప్రసాద్ కుమార్‌ను అధికారికంగా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ స్థానంలో రేవంత్, భట్టి విక్రమార్క కూర్చోబెట్టారు. అనంతరం గడ్డం ప్రసాద్‌కు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు.
‘‘ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. మంచి సంప్రదాయానికి సభ తొలిరోజే నాంది పలికింది. భవిష్యత్‌లోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలి. ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
గడ్డం ప్రసాద్ తన సొంత జిల్లా నేత అని తెలిపారు. వికారాబాద్‌కు ఎంతో విశిష్టత ఉందన్నారు. వికారాబాద్ గుట్ట వైద్యానికి పెట్టింది పేరన్నారు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు గడ్డం ప్రసాద్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారని కొనియాడారు.
Also Read: TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, రేపట్నుంచి ఆ రూట్లో ఏసీ బస్సులు ప్రారంభం