TGSRTC: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అలాగే ఆర్టీసీలో (TGSRTC) భారీ మార్పులు కూడా చేపట్టింది. అయితే పండగల సమయాల్లో కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అనేక రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజాగా మరో గుడ్ న్యూస్ చెబుతూ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీలో తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.
హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు పాస్ తీసుకున్నవారికి టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ఉన్నవారికి ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు శుభవార్త చెప్పింది. తమ దగ్గర ఉన్న బస్ పాస్ తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ- గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్ లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. మెట్రో ఎక్స్ ప్రెస్ తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్ఫక్ బస్ పాస్ దారులు ఈ రాయితీని పొందవచ్చు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది.
Also Read: Ram Gopal Varma: సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై వరుసగా రెండు కేసులు నమోదు..
అలాగే హైదరాబాద్ లో దాదాపు 70 వేల వరకు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాసులున్నాయి. వారిలో ఎక్కువగా వీకెండ్ లో సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే బస్ పానుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీని పొందవచ్చు. జనరల్ బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.