తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. శంషాబాద్ RTC బస్టాండ్ నుంచి విమానాశ్రయం మీదుగా తుక్కుగూడ వరకు “ఏరోరైడర్ – ఎయిర్‌పోర్ట్ స్పెషల్” పేరుతో ఆర్డినరీ బస్సు సేవలు ప్రారంభించబడినాయి. సోమవారం రాజేంద్రనగర్ డిపో మేనేజర్ కృష్ణారెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. ఈ మార్గంలో ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు బస్సులు బయలుదేరి, విమానాశ్రయం డిపార్చర్ టెర్మినల్ మీదుగా ప్రయాణిస్తాయి. ఒక్కసారి ప్రయాణానికి కేవలం రూ.20 మాత్రమే ఛార్జీగా నిర్ణయించడమై ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన సేవ అందనుంది.
Hyderabad : బైక్‌పై 8 మందితో స్టంట్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన యువకులు
ఈ సేవల్లో మహాలక్ష్మి ఫ్రీ బస్ పాస్ మినహా మిగతా అన్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పాస్‌లు చెల్లుబాటు అవుతాయి. దీంతో విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు మరియు సాధారణ పాస్‌దారులకు ప్రయాణం మరింత సులభతరంగా మారింది. విమానాశ్రయం వెళ్లే వారు ఇప్పటివరకు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుండగా, ఇప్పుడు RTC అందించిన ఈ బస్సు సేవలతో ఆ అవసరం తీరింది. ఇది ఒక విశిష్టమైన ముందడుగుగా చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ఇటీవల అత్తాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణీ స్త్రీ మరణించిన ఘటనపై RTC డ్రైవర్‌పై దాడి జరిగిన నేపధ్యంలో RTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ విద్యాసాగర్‌పై జరిగిన దాడిని ఖండించిన ఆయన, సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవర్‌ను ఆసుపత్రిలో పరామర్శించిన ఆయన, పోలీసుల సహకారంతో బాధ్యులపై రౌడీషీట్లు కూడా తెరిచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ తప్పు లేనప్పటికీ అతనిపై దాడి జరగడం దురదృష్టకరం అని అన్నారు.