Site icon HashtagU Telugu

TGRTC : రాఖీ కట్టేందుకు వెళ్తుండగా పురిటినొప్పులు..బస్సు లోనే ప్రసవం

Tgsrtc Conductor Helps Woma

Tgsrtc Conductor Helps Woma

రాఖీ పండుగ (Raksha Bandhan) రోజున మహిళకు బస్సులోనే కండక్టర్ (Bus Conductor) ప్రసవం చేసి వార్తల్లో నిలిచింది. నేడు రక్షాబంధన్ (Raksha Bandhan) సందర్బంగా దేశ వ్యాప్తంగా మహిళలంతా తమ సోదరులకు రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో తమ సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తూ ఓ నిండు గర్భిణీ ఆర్టీసీ బస్సు లోనే ప్రసవం అయినా ఘటన వనపర్తి లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రాఖీ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తుంది. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించింది. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోసింది. పండంటి ఆడ‌బిడ్డ‌కు మ‌హిళ మహిళా జన్మించింది. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ MD సజ్జనార్ Xలో షేర్ చేశారు. సామాజిక బాధ్యతగా RTC ఉద్యోగులు సేవాస్ఫూర్తిని చాటడం గొప్ప విషయమని కొనియాడారు.

Read Also : Tecno Spark Go 1: కేవలం రూ. 8వేలకే 5జీ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా!

Exit mobile version