Site icon HashtagU Telugu

Group 3 : తెలంగాణ గ్రూప్‌ – 3 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల

Tgpsc group 3 Hall Tickets Telangana Tspsc

Group 3 : గ్రూప్‌ – 3 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది.  దాదాపు 1380 గ్రూప్‌-3 పోస్టుల కోసం 5.36 లక్షల మందికిపైగా అప్లై చేసుకున్నారు. ఇక వీరంతా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైటు నుంచి  హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Also Read :Dev Deepawali : నవంబరు 15 వర్సెస్ 16.. ‘దేవ్ దీపావళి’ ఎప్పుడు ?

Also Read :Russia : అమెరికాకు చెక్.. ఉత్తర కొరియాతో పుతిన్ మెగా డీల్.. ఏమిటి ?

నవంబరు 20 వరకు టెట్ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో టెట్‌ కోసం ఈ నెల 7 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.  దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20 వరకు అవకాశం ఇచ్చారు.  2025 జనవరి 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం మే 20 నుంచి జూన్‌ 2 వరకు ఆన్‌లైన్‌‌లో టెట్ పరీక్షలు నిర్వహించారు. త్వరలో జరగబోయేది రెండో టెట్‌ పరీక్ష. టెట్‌కు ఈసారి కూడా భారీ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.