Group 1 : గ్రూప్‌ 1 హాల్‌టికెట్స్‌ వచ్చేశాయ్‌.. 9న ఎగ్జామ్.. రూల్స్ ఇవే

తెలంగాణలో గ్రూప్‌-1‌కు అప్లై చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్.

  • Written By:
  • Updated On - June 1, 2024 / 02:44 PM IST

Group 1 : తెలంగాణలో గ్రూప్‌-1‌కు అప్లై చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదలయ్యాయి. ఇప్పటి నుంచి అభ్యర్థులు TGPSC వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన రూల్స్,  ఓఎంఆర్ షీట్ నమూనాపత్రాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు చూడొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

గ్రూప్ -1 ప్రిలిమ్స్ జరిగే నగరాలివే.. 

గ్రూప్-1(Group 1) ప్రిలిమ్స్ పరీక్ష జరిగే కేంద్రాల వివరాల్లోకి వెళితే..  ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్- మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌లలో ఎగ్జామ్ జరుగుతుంది.  జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు.

Also Read :Drugs In Toys : బొమ్మలు, లంచ్ బాక్సుల్లో డ్రగ్స్.. దొరికిపోయిన స్మగ్లర్లు

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. పరీక్ష కేంద్రాలలోకి కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, పెన్‌ డ్రైవ్‌, వాచ్‌, జ్యువెల్లరీ, ఇతర గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు. అభ్యర్థులు షూ వేసుకోరాదు. పరీక్ష పూర్తయ్యే వరకు ఎగ్జామ్‌ సెంటర్‌ నుంచి వెళ్లేందుకు అనుమతి లేదు. ఎగ్జామ్‌ సెంటర్‌‌లో బయోమెట్రిక్‌ ఇవ్వకపోతే వారి ఓఎంఆర్‌ ఆన్సర్‌ షీట్‌ మూల్యాంకనం చేయరు.

Also Read : Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరు ఫైన‌ల్ చేశారా..?