Group 1 Hall Ticket: తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్‌.. జూన్ 1 నుంచి హాల్‌టికెట్లు..!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) రాష్ట్రంలో గ్రూప్ 1 స్థానాల భ‌ర్తీ కోసం ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నుంది.

  • Written By:
  • Updated On - May 24, 2024 / 07:15 AM IST

Group 1 Hall Ticket: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) రాష్ట్రంలో గ్రూప్ 1 స్థానాల భ‌ర్తీ కోసం ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నుంది. తెలంగాణ రాష్ట్ర కమిషన్ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ ఖాళీల కోసం ఈ ఏడాది 23 ఫిబ్రవరి నుండి 16 మార్చి 2024 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు TGPSC (గ‌తంలో TSPSC) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌ 9న ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. ఈసారి పరీక్షలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్ర‌మంలోనే గ్రూప్-1 ప‌రీక్ష రాసే అభ్య‌ర్థుల‌కు బోర్డు కీల‌క అప్డేట్ ఇచ్చింది. జూన్ 9న జ‌ర‌గ‌బోయే ప‌రీక్ష‌కు జూన్ 1 నుంచి హాల్ టికెట్లు (Group 1 Hall Ticket) అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొంది.

పరీక్ష షెడ్యూల్

జూన్ 9, 2024న ప్రిలిమినరీ టెస్ట్ జరుగుతుందని గ్రూప్-I సర్వీసెస్ పరీక్ష షెడ్యూల్ ప్రకటించబడింది. ప్రిలిమినరీ టెస్ట్ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 21, 2024న నిర్వ‌హించ‌నున్నారు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్య‌ర్థులు మాత్ర‌మే మెయిన్ ఎగ్జామ్‌కు అర్హ‌త సాధిస్తారు.

Also Read: USA Bowlers Script History: టీ20 క్రికెట్‌లో సంచ‌ల‌నం.. బంగ్లాను చిత్తుగా ఓడించిన USA..!

ఎగ్జామ్ విధానం

– తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా విధానం 2024 అభ్యర్థుల జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీని పరీక్షిస్తుంది.
– ప్రశ్నపత్రంలోని ప్రశ్నలన్నీ బహుళైచ్ఛికంగా ఉంటాయి.
– ఈ విభాగాన్ని పూర్తి చేయడానికి అభ్యర్థులకు 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది.
– పరీక్ష మార్కుల విలువ 150 మార్కులు.
– ఎగ్జామ్‌ను ఓఎంఆర్ విధానంలోనే నిర్వ‌హించ‌నున్నారు.

We’re now on WhatsApp : Click to Join

గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింద ఇచ్చిన సుల‌భ‌మైన దశలను అనుసరించండి:

– తొలుత tspsc.gov.in/లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక సైట్‌కు వెళ్లండి.
– ప్రధాన పేజీలో TSPSC గ్రూప్ 1 హాల్ టిక్కెట్‌ల లింక్‌ను కనుగొనండి.
– ఈ లింక్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతోంది.
– అందించిన ఫీల్డ్‌లలో మీ ID, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
– స్క్రీన్‌పై మీ TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్‌ను వీక్షించడానికి “లాగిన్” బటన్‌ను క్లిక్ చేయండి.
– హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేసి పరీక్షా కేంద్రానికి తీసుకురండి.