Site icon HashtagU Telugu

TG Assembly : కోమటిరెడ్డి-జగదీష్ రెడ్డి ల మధ్య ‘రాజీనామా’ ఛాలెంజ్..

Jagadesh Krv

Jagadesh Krv

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session 2024) వాడివేడిగా నడుస్తున్నాయి. మొన్న బడ్జెట్ ఫై హరీష్ రావు (Harish Rao) స్పందించగా..ఈరోజు విద్యుత్ (Electricity) ప‌ద్దుల‌పై చ‌ర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Minister Komati Reddy, Former Minister Jagadish Reddy) ల మధ్య మాటలయుద్ధం నడిచింది. నల్గొండలో జగదీశ్ రెడ్డిపై క్రిమినల్ రికార్డ్ ఉందని కోమటిరెడ్డి ఆరోపించారు. అయితే ఆ రికార్డ్ చూపిస్తే ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించకపోతే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

రేవంత్ రెడ్డి ఎందుకు జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో.. మ‌ళ్లీ అక్క‌డికే వెళ్లాల‌ని అనుకుంటున్నాడు. నాకు కూడా చంచ‌ల్‌గూడ జైలు జీవితం గుర్తుంది. తెలంగాణ ఉద్య‌మం కోసం జైలుకు పోయాం. ఆయ‌న‌కు చ‌ర్ల‌ప‌ల్లినే గుర్తు ఉంట‌ది మ‌ళ్లీ యాది చేసుకంటున్నాడు. సీఎం రేవంత్, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి త‌న‌పై ఆరోప‌ణ‌ల చేసిన‌ ప్ర‌తి అక్ష‌రం రికార్డుల నుంచి తొల‌గించాలి అని జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం దొంగ‌త‌నం దొరికిపోయింది కాబ‌ట్టే రేవంత్ రెడ్డి ఎందుకు భుజాలు త‌డుముకుంటున్నార‌ని జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. మా అధినేత‌ కేసీఆర్ హ‌రిశ్చంద్రుడే.. రేవంత్ రెడ్డిలా సంచులు మోసే చంద్రుడు కాదు.. చంద్రుడికి సంచులు మోసి జైలుకు పోయింది రేవంత్ రెడ్డినే అంటూ జగదీష్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసారు. నేను విద్యుత్ విష‌యంలో నిజ‌నిజాలు మాట్లాడుతుంటే.. రేవంత్ రెడ్డినే వ‌డివ‌డిగా స‌భ‌లోకి వ‌చ్చి నాకు అడ్డు తగిలారు… సీఎం స‌భ‌లో అడుగు పెట్ట‌గానే త‌ప్పుదోవ ప‌ట్టింది అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

వాస్త‌వానికి విద్యుత్ ప‌ద్దుల‌పై డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన స‌మాధానం సీఎం రేవంత్ ఇచ్చారు. సీఎం 20 నిమిషాలు మాట్లాడారు. న‌న్ను ఒక్క నిమిషంలో పూర్తి చేయాలంటే ఎలా..? డెమోక్ర‌టిక్‌గా ఎంత సేపైనా మాట్లాడొచ్చు అంటున్నారు. త‌మ‌రు ద‌య‌చేసి అవ‌కాశం ఇవ్వండి.. 10 నిమిషాలు ఇస్తే కంప్లీట్ చేయ‌గ‌లుగుతా 20 నిమిషాలు ఆరోప‌ణ‌లు చేస్తే 10 నిమిషాలైనా స‌మాధానం చెప్పాలి క‌దా..? అని జ‌గదీశ్ రెడ్డి ప్ర‌శ్నించారు.

Read Also : Olympic Games Paris 2024 : నిరాశపరిచిన రమితా జిందాల్