TET Results : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రిజల్ట్స్ ఇవాళ ఉదయం 10 గంటలకు వచ్చేశాయి. ఫైనల్ ఆన్సర్ ‘కీ’ కూడా రిలీజ్ అయింది. టీఎస్ టెట్ 2023 రిజల్ట్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. టీఎస్ టెట్ వెబ్ సైట్ లో పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని చూడొచ్చు. టెట్ ఎగ్జామ్ సెప్టెంబరు 15న జరగగా పేపర్-1 పరీక్షకు 2,26,744 మంది, పేపర్-2 పరీక్షకు 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
Also read : Train On Platform : ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు.. ఏం జరిగిందంటే ?
టెట్ లో క్వాలిఫై అయిన వారు టీఆర్టీకి అప్లై చేసుకోవచ్చు. ఈ కారణంగానే అధికారులు టెట్ ఫలితాలను త్వరగా రిలీజ్ చేశారు. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష జరగనుంది.