జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ (Pedda Dhanwada) గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న గాయత్రి కంపెనీ ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol factory)పై ప్రజలు మరోసారి తిరగబడ్డారు. గతంలోనే దీనిని వ్యతిరేకించిన 10 గ్రామాల ప్రజలు, మళ్లీ పరిశ్రమ పనుల్లో మొదలు కావడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వానికి అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఫ్యాక్టరీను పూర్తిగా తరలించాలన్న డిమాండ్‌కు ఇప్పటివరకు సరైన స్పందన రాకపోవడం, మళ్లీ పరిశ్రమకు చెందిన సిబ్బంది వచ్చి పనులు ప్రారంభించడమే ఈ ఉద్రిక్తతకు కారణమైంది.
Sindhura plant : ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం: ప్రధాని మోడీ
బుధవారం పరిశ్రమ ప్రతినిధులు పెద్దధన్వాడకు రాగా గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. తమ ప్రాణాలకు హాని కలిగించే పరిశ్రమను అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఆగ్రహంతో రోడ్డుపై ధర్నాలు చేశారు. పరిశ్రమ సమీపంలోని గుడారాలు, కంటెయినర్లు, టిప్పర్లు, జేసీబీలను ధ్వంసం చేశారు. పనులకు వచ్చిన కూలీలను తరిమికొట్టారు. ఈ సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో తోపులాట జరిగింది. కొందరు కింద పడిపోయి గాయపడ్డారు.
Ayodhya : అయోధ్య రామాలయంలో మరోసారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం
ఈ ఉద్రిక్తత నేపథ్యంలో ఎమ్మెల్యే విజయుడు పోలీస్ స్టేషన్‌కి చేరుకుని ఆందోళనకారులను పరామర్శించారు. పోలీసులతో పాటు ఫ్యాక్టరీ సిబ్బందితో వచ్చిన బౌన్సర్లు తాము మానసిక, శారీరక వేధింపులకు గురయ్యామని ఆందోళనకారులు ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై చేయి చేసుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ పూర్తిగా తరలించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్థానికులు స్పష్టంగా చేసారు.