తెలంగాణ (Telangana ) లో అధికార పార్టీ కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress – BRS) ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిత్యం ఇదొక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఆ మధ్య రుణమాఫీ , ఆ తర్వాత వరదల అంశం , ఇప్పుడు హైడ్రా అంశం కాకరేపుతుంది. రేవంత్ సర్కార్ (Revanth Sarkar) ఆలోచన లేకుండా హైడ్రా ను తీసుకొచ్చి ప్రజలను రోడ్డు మీదకు తీసుకొస్తున్నారని బిఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ సోమవారం తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొండా సురేఖ (Konda Surekha)పై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి ట్రై చేసారు.
తెలంగాణ భవన్ (Telangana Bhavan) ఎదురుగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ట్రై చేయగా. ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తల తోపులాట, వాగ్వాదం నెలకొన్నాయి. కొంతమంది కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ఇదిలా ఉంటె హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు(High Court) సోమవారం విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) వర్చువల్‌గా(Virtually) కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీన్‌పూర్ తహసీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లోగా ఖాళీ చేయాలని నోటీసులిచ్చి.. 40 గంటల్లోపే ఎలా కూల్చేస్తారని న్యాయస్థానం సీరియస్ అయింది. తాము అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలంటూ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు బెంచ్(HYDRA) స్పష్టం చేసింది. చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా అని హైడ్రా కమిషనర్‌ను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ‘‘కేవలం శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాతే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు ? సెలవు రోజుల్లోనే అందరికీ నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేయడానికి కారణం ఏమిటి ? శని, ఆదివారాల్లో నిర్మాణాలను కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయి కదా ?’’ అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం ఎందుకు పని చేయాలి ? ఉన్నతాధికారులను మెప్పించేందుకు ఎవరూ చట్ట విరుద్ధంగా పని చేయొద్దు’’ అని న్యాయస్థానం సూచించింది.
Read Also : CM Chandrababu : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష