హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ (Somajiguda Press Club) వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) వ్యవసాయంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై ప్రత్యుత్తరంగా, వ్యవసాయ అభివృద్ధిపై ఎవరు ఎంత చేశారు అనేదానిపై తేల్చుకునేందుకు ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఈరోజు (జూలై 8) ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తానని చెప్పగా, అక్కడికి ఆయన చేరుకుంటూ తన చర్చ సిద్ధతను పునరుద్ఘాటించారు.
Heart Attack : ఆరోగ్యంగా ఉన్నప్పటికీ “ హార్ట్ ఎటాక్” ఎందుకు వస్తుంది?
కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ వర్గం నుంచి స్పందనగా “సీఎంతోనే చర్చ చేస్తానని కేటీఆర్ అంటున్నాడు, కానీ సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. చర్చకు మంత్రులు సిద్ధంగా ఉన్నారు” అంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. “కేటీఆర్ డైరెక్ట్ డిబేట్‌కు రావడం సాహసమా? లేక రాజకీయం?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు కేటీఆర్‌ను అసెంబ్లీలో చర్చకు రావాలని ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, ప్రత్యుత్తరాలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద టెన్షన్ టెన్షన్ గా ఉంది. ఎప్పుడు ఏంజరుగుతుందో అని అంత టెన్షన్ పడుతున్నారు.