Site icon HashtagU Telugu

KTR Sagaraharam: సాగరహారానికి పదేళ్లు.. ఆ నేతల ఎక్కడ? అంటూ కేటీఆర్ ట్వీట్!

Ktr1

Ktr1

తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకుపోయిన సందర్భం ఏదైనా ఉందంటే.. అందరికీ ముందుకుగా గుర్తుకువచ్చేది సాగరహారం మాత్రమే. అప్పటికే సకల జనుల సమ్మె లాంటి వరస కార్యక్రమాలతో ఢిల్లీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేశారు తెలంగాణవాదులు. సరిగ్గా పదేళ్ల కిందట తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను బలంగా చాటే క్రమంలో సాగరహారం కు జేఏసీ పిలుపునిచ్చింది. పిల్లా పెద్దా అన్న తేడా లేకుంట చీమల దండులాగా కదిలివచ్చి చిరుతపులుల్లా ఎగబడ్డరు.. ఎన్ని అడ్డంకులెదురైనా లఠీలు విరిగినా అదరకుండ బెదరకుండ ఢిల్లీ పెద్దల గుండెల్లో గుబులు పుట్టించారు. మన సాగరహారానికి పదేళ్లు.

సాగరహారానికి పదేళ్లు అయిన సందర్భంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం.. లక్షల గొంతుకలు ‘జై తెలంగాణ’ అని నినదించిన రోజు. ప్రతిరోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్ కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ?‘‘ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. ఈ ట్వీట్ పై ప్రతిపక్ష పార్టీల నేతలు ఏవిధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే!

Exit mobile version