Site icon HashtagU Telugu

Ragging: హైదరాబాద్ లో ర్యాగింగ్ కలకలం, పది మంది విద్యార్థులు సస్పెండ్!

Ragging

Ragging

Ragging: పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా, కాలేజీ యజామాన్యాలు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా ర్యాగింగ్ బూతానికి చెక్ పడటం లేదు. ఇప్పటికే ర్యాగింగ్ కారణంగా ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలను పాడు చేసుకున్నారు. గతంలో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి. అయినా ర్యాగింగ్ జరుగుతూనే ఉంది.

తాజాగా సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ర్యాగింగ్ కు పాల్పడిన పది మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. వారాంతంలో మొదటి-సంవత్సరం MBBS విద్యార్థులు ర్యాగింగ్‌కు గురయ్యారు. బాధితుల్లో ఒకరు సంఘటనను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)కి దాని పోర్టల్ ద్వారా తెలియజేశారు.

ర్యాగింగ్ జరిగినట్టు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (DME) డాక్టర్ రమేష్ రెడ్డి ధృవీకరించారు. “సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పది మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. యాంటీ-విద్యార్థుల విచారణ తర్వాత ర్యాగింగ్ కమిటీ, 2021 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు. 2022 బ్యాచ్‌కి చెందిన ఐదుగురు విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు ఒప్పుకున్నారు. ఫలితంగా మొత్తం పది మంది విద్యార్థులను ఒక సంవత్సరం పాటు కళాశాల నుండి సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

Also Read: Shocking: డ్రైవర్ అవతారమెత్తిన దొంగ, బస్సు దొంగతనం చేసి, ప్రయాణికుల డబ్బుతో పరార్

Exit mobile version