ఫిబ్రవరి లోనే ఎండలు..ఇలా ఉన్నాయంటే ఏప్రిల్ , మే లో ..?

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 12:50 PM IST

వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) ఫిబ్రవరి లోనే ఇలా ఉన్నాయంటే..ఏప్రిల్ , మే లో ఇంకెలా ఉండబోతాయో..? గత మూడు రోజులుగా తెలంగాణ లో ఎండ తీవ్రత చూసి రాష్ట్ర ప్రజలు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఫిబ్రవరి లో పెద్దగా ఎండలు అనిపించవు..కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారంలోనే భానుడి భగభగమంటున్నాడు. గత మూడు రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.

We’re now on WhatsApp. Click to Join.

మంగళవారం రాష్ట్రంలోని చాల జిల్లాలోపగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో ఇదే గరిష్ఠ పెరుగుదల కావడం గమనార్హం. నిన్న ఆదిలాబాద్ లో 4.5 డిగ్రీలు పెరిగి 36 డిగ్రీలకు చేరుకుంది. ఖమ్మంలో 31 డిగ్రీలు ఉండాల్సి ఉండగా 35 డిగ్రీలకు చేరింది.ఇక రాజధాని హైదరాబాద్ లోను భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే 3.7 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 2.9, నిజామాబాద్‌లో 2.8, మెదక్‌లో 2.2, రామగుండంలో 2.1, హనుమకొండలో 1.9, భద్రాచలంలో 1.5 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూటనే కాకుండా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే ఎండాకాలం పూర్తిగా ప్రారంభమైతే ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.

Read Also : Free Bus Journey : ఈ బస్సుల్లో పురుషులకూ ప్రయాణం ఉచితం