Kavitha MLC: తెలంగాణ బిడ్డలు సొంతగడ్డ రుణం తీర్చుకోవాలి!

అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారందరినీ ఒక్కచోటుకు చేర్చి చర్చించేందుకు ఆటా మహాసభలు అవకాశాన్ని అందించాయన్నారు ఎమ్మెల్సీ కవిత.

  • Written By:
  • Updated On - July 5, 2022 / 12:56 PM IST

అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వారందరినీ ఒక్కచోటుకు చేర్చి పలు అంశాలపై నిర్మాణాత్మకంగా చర్చించేందుకు ఆటా మహాసభలు మంచి అవకాశాన్ని అందించాయన్నారు ఎమ్మెల్సీ కవిత. వాషింగ్టన్ లో టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. విదేశాల్లో గొప్ప స్థానాల్లో స్థిరపడిన ప్రవాస తెలుగు ప్రజలు, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ ఏడాది జరిగిన ఆటా మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కవిత పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న అనేక గొప్ప కార్యక్రమాలను ప్రవాసులకు తెలియజేసేందుకు ఆటా మహాసభలు వేదికగా నిలిచాయని అభిప్రాయపడ్డారు. విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసీయులు సొంతగడ్డ రుణం తీర్చుకునేందుకు వీలైనంత సహకారం అందించాలని కవిత కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య , గాద‌రి కిషోర్‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, గువ్వల బాలరాజు , చంటి క్రాంతి కిర‌ణ్‌, బొల్లం మల్లయ్య , టిఎస్ఐఐసి చైర్మ‌న్ గాద‌రి బాల‌మ‌ల్లు , టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు.