హైదరాబాద్(Hyderabad)లో నేటి నుంచి మూడురోజుల పాటు.. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు (Telugu Mahasabhalu) జరగనున్నాయి. తెలుగు భాష ప్రాముఖ్యత., సంస్కృతి విశేషాలతో పాటు పలు రకాల కార్యక్రమాలు ఈ మహాసభల్లో నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల్లో తెలుగు రాష్ర్టాల సీఎంలు సహా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు హాజరుకానున్నారు. రాజకీయ నాయకులు, సినీకళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపార ప్రముఖులు కూడా పాల్గొననున్నట్లు ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్ (President of the Telugu Federation Indira Dutt) తెలిపారు.
ఈరోజు నుండి జనవరి 5వ తేదీ వరకు హెచ్‌ఐసిసి నోవాటెల్‌లో ఈ మహాసభలు జరగనున్నాయి. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలుగా జరుగుతున్న ఈ వేడుకలు తెలుగుదనం ప్రతిబింబించే కార్యక్రమాలతో కనువిందు చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) శుక్రవారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు.
Railway Station : రైలొచ్చింది… కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుపై అక్కడివారి ఆనందం..
ఈ మహాసభల్లో తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనబోతున్నారు. సాహిత్య సదస్సులు, జానపద కళారూపాల ప్రదర్శనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సినీ సంగీత విభావరి వంటి కార్యక్రమాలు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించబోతున్నాయి. మహాసభల్లో మహిళా సదస్సులు, బిజినెస్ సదస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, యునికార్న్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నాయి. విదేశాల్లోని తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ వేడుకల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. అలాగే తెలుగు చేనేత వస్త్ర ప్రదర్శన కూడా ఈ మహాసభల ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
సినీ రంగానికి చెందిన చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), జయసుధ(Jayasudha), జయప్రద (Jayaprada) వంటి ప్రముఖులు మహాసభల్లో పాల్గొనబోతున్నారు. రామ్ మిర్యాల సంగీత విభావరి ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ తరలిరావాలని ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వాహకులు కోరుతున్నారు.