Telugu Girl Killed: అమెరికా కాల్పుల ఘటనలో తెలుగు యువతి మృతి!

అమెరికాలో (America) గన్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.

Published By: HashtagU Telugu Desk
Telugu Girl

Telugu Girl

అగ్ర రాజ్యమైన అమెరికాలో (America) గన్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల టెక్సాస్ మాల్‌లో జరిగిన కాల్పుల్లో (Gun Firing) ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే అందులో 27 ఏళ్ల తెలుగు మహిళ, రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య తాటికొండ కూడా ఉంది. హైదరాబాద్‌లోని (Hyderabad) సరూర్‌నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య పర్‌ ఫెక్ట్‌ జనరల్‌ కాంట్రాక్టర్స్‌ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

శనివారం జరిపిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి కూడా ప్రాణాలు (Killed) కోల్పోయింది.  ఈ సంవత్సరం USAలో కనీసం 160 సామూహిక కాల్పులు జరిగాయని తెలుస్తోంది. ఇటీవలనే  జరుగుతున్న వరుస కాల్పులు ఆ దేశాన్ని భయపెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవాంధ్రులు, విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ జీవితం వెళ్లదీస్తున్నారు. అమెరికాలో ఇటీవలి కాలంలో సామూహిక కాల్పులు పెరుగుతున్నాయని మీడియా కూడా చెబుతోంది.

Also Read: 41K Missing: గుజరాత్ లో 41 వేల మహిళల అదృశ్యం.. మోడీ మౌనం!

  Last Updated: 08 May 2023, 12:39 PM IST