Site icon HashtagU Telugu

KTR in Paris : ఫ్రాన్స్ పర్యటనలో కేటీఆర్.. పలు కీలక అంశాలపై చర్చ!

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు బయలుదేరివెళ్లారు. ఇవాళ ఫ్రాన్స్‌ ఎగువ సభలో (సెనేట్‌) జరిగే ‘యాంబిషన్‌ ఇండియా-2021’ సదస్సులో పాల్గొన్నారు. ‘గ్రోత్‌-డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా (కొవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. అనంతరం పలువురు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమయ్యారు.

తొలిరోజున మంత్రి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ ప్రభుత్వ డిజిటల్‌ వ్యవహారాల అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌తో సమావేశమయ్యారు. ఇన్నో వేషన్, డిజిటైజేషన్, ఓపెన్‌ డేటా వంటి అంశాల్లో ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో ఇన్నోవేషన్, అంకుర సంస్థలను ప్రోత్సహించ డానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, ఓపెన్‌ డేటా పాలసీ, డిజిటల్‌ రంగంలో రాష్ట్రంలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి మంత్రి కేటీఆర్, హెన్రీ వర్డియర్‌కు వివరించారు. తెలంగాణలోని అంకుర సంస్థలకు ఫ్రాన్స్ లో, ఫ్రాన్స్‌లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడంపై కూడా విస్తృత చర్చ జరిగింది.

Exit mobile version