దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.97 శాతం

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు దేశ జీడీపీ తెలంగాణ వాటా 4.06గా ఉంటే, ప్రస్తుతం 4.97 శాతం పెరిగిందని, ఫలితంగా దేశంలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

  • Written By:
  • Updated On - October 1, 2021 / 01:35 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని మంత్రి హరీశ్ రావు అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధాలు, పరిశ్రమలు, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, అందుకే తెలంగాణ జీడీపీ సైతం పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు 4.06గా ఉంటే, ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాట 4.97 శాతం పెరిగిందన్నారు. దేశంలోనే తెలంగాణ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

తెలంగాణ అన్ని రంగాల్లో డెవలప్ మెంట్ సాధించిందని నీతి అయోగ్ సైతం రిపోర్ట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేస్తామని, రైతుల సంక్షేమానికి రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలు ప్రవేశపెడుతూ వ్యవసాయం మరింత బలోపేతమైందన్నారు. అర్హులైన వాళ్లకు గొర్రెలు, డెయిరీలను అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేశామని మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఎలక్ట్రానిక్స్‌ తయారీ, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజాలను తెలంగాణలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇప్పటికే తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్‌ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్‌ సొల్యూషన్స్‌ వంటి రంగాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.