Rakhi To KTR: తెలంగాణలో రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారం కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉంది. ప్రతి పథకంలో తప్పులు ఉన్నాయంటూ చెబుతుంది. దీనికి కాంగ్రెస్ సైతం తగ్గటంలేదు. అందుకు తగ్గట్టుగానే కౌంటర్లు ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారంలో వస్తే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. చెప్పిన విధంగానే సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసింది.
అయితే ఇటీవల ఈ పథకంపై అలాగే అందులో ప్రయాణించే మహిళలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Rakhi To KTR) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఓ రెండు రోజులపాటు రాష్ట్రంలోని మహిళా లోకం అంతా కేటీఆర్‌పై విమర్శలు కురిపించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సైతం సిరీయస్‌గా తీసుకుంది. వెంటనే కేటీఆర్‌కు నోటిసులు పంపింది. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి గల కారణాలను కమిషన్ ముందట హాజరై చెప్పాలని తెలిపింది.
Also Read: Brahmotsavam 2024: అక్టోబరు 4న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
రాఖీకి కూడా భయపడితే ఎలా? pic.twitter.com/6H2Pk7afu2
— KTR (@KTRBRS) August 24, 2024
అయితే ఇటీవల రాజకీయ బిజీ షెడ్యూల్ వలన కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరుకాలేకపోయారు. తాజాగా ఆయన ఈరోజు ఉదయం మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చుకున్నారు. అయితే తాను కావాలని చేసిన వ్యాఖ్యలు కావని, మహిళలంటే తనుకు ఎంతో గౌరవమని కేటీఆర్ కమిషన్ విచారణ అనంతరం మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అదే కేటీఆర్‌కు మహిళా కమిషన్ సభ్యులు రాఖీ కట్టడం.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిందో లేదో రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. దీనిపై కేటీఆర్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. తనకు రాఖీ కట్టిన మహిళలకు నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. చేతి నిండా రాఖీలతో ఉన్న ఫొటోను Xలో పోస్ట్ చేసిన ఆయన ‘రాఖీకి కూడా భయపడితే ఎలా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన డైరెక్ట్‌గానే కౌంటర్ ఇచ్చారని బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.