Krishna Water Controversy : తెలంగాణకు తప్పకుండా న్యాయం జరుగుతుంది – ఉత్తమ్

Krishna Water Controversy : క్రిష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (KWDT-II) తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ కు గర్వకారణమైంది

Published By: HashtagU Telugu Desk
Krishna Water Controversy I

Krishna Water Controversy I

కృష్ణా జలాల విషయంలో (Krishna Water Controversy) తెలంగాణ (Telangana) రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆందోళన ఎప్పటి నుండో కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలో కృష్ణ జలాల పంపిణీపై న్యాయం కోరిన సందర్భంలో క్రిష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (KWDT-II) తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ కు గర్వకారణమైంది. ISRWD చట్టం, 1956 ప్రకారం కేంద్రం జారీ చేసిన కొత్త నిబంధనలపై మొదట విచారణ చేపట్టాలని ట్రిబ్యునల్ నిర్ణయించింది.

Soaked Raisins: పాల‌లో నాన‌బెట్టిన ఎండుద్రాక్ష‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

తెలంగాణ రాష్ట్రం కొత్తగా ప్రతిపాదించిన నిబంధనలపై ముందుగా విచారణ జరపాలని కోరగా, ఆంధ్రప్రదేశ్ దీనికి వ్యతిరేకంగా అభ్యంతరం తెలిపింది. ఏకకాలంలో రెండు నిబంధనలపై విచారణ జరపాలని ఆంధ్ర ప్రదేశ్ కోరినా, ట్రిబ్యునల్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఏపీలోని రిట్ పిటిషన్ నేపథ్యంలో జటిలతలు నివారించడంలో ఇది సముచితమని ట్రిబ్యునల్ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి 68.5% క్రిష్ణా నదీ ప్రవాహం కలిగిన ప్రాంతం ఉండగా, కేవలం 299 టీఎంసీలను మాత్రమే కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) తప్పుపట్టారు.

ట్రిబ్యునల్ తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తుందని, ఫిబ్రవరి 19న మొదలుకానున్న నూతన నిబంధనలపై విచారణ తెలంగాణకు అనుకూలంగా ఉంటుంది అని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ తీర్పు తెలంగాణ ప్రజల నీటి హక్కుల కోసం బలమైన ఆధారం అవుతుందని పేర్కొన్నారు. క్రిష్ణా జలాల పంపిణీపై జరుగుతున్న ఈ ప్రాధాన్యతతో కూడిన విచారణ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కీలకమని భావించాలి. జలాల హక్కులు, ప్రజల జీవనోపాధి రక్షణకు ప్రభుత్వ చర్యలు మరింత చురుకుగా ఉండాలని, ప్రజలు ఈ న్యాయ పోరాటంలో ప్రభుత్వం పట్ల సంపూర్ణ మద్దతు వ్యక్తం చేయాలని ఆకాంక్షిద్దాం.

  Last Updated: 17 Jan 2025, 09:52 AM IST