అగ్గి పెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఘనత మన నేతన్నలది. చేనేత రంగంలో అంతటి ఖ్యాతి గడించిన వాళ్లు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 1905లో పశ్చిమ బెంగాల్ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం చేనేత రంగంతో మొదలైంది. కలకత్తా టౌన్ హాల్‌లో 1905 ఆగస్టు7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రపంచం మారుతున్నా.. టెక్నాలజీ కొంత పుంతలు తొక్కుతున్నా.. నేటికి చేనేత కార్మికులు మగ్గాలను నమ్ముకొని అద్భతమైన చీరలను నేస్తున్నారు.
స్థానిక కళాకారులు తమ తమ నైపుణ్యంతో రాణిస్తూ అంతర్జాతీయంగా పేరుగడిస్తున్నారు. తాజాగా ఓ కార్మికుడు అగ్గిపెట్టెలో పట్టె చీరను నేశాడు. ఈ విషయం తెలంగాణ మంత్రి కేటీఆర్ కు తెలియడంతో, దానికి సంబంధించిన ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. ఇది ప్రతిభావంతులైన నేత సృష్టించిన ఒక కళాఖండాన్ని గురించి మాట్లాడుతుంది అంటూ ట్వీట్ చేశారు. నల్ల విజయ్ అనే చేనేత కార్మికుడు తెలంగాణలోని సిరిసిల్ల పట్టణానికి చెందినవాడు. అతను స్వచ్ఛమైన పట్టుతో చేసిన చీరను నేస్తున్నాడు. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరను నేసి ప్రదర్శించాడు. అతడి ప్రతిభను పలువరు తెలంగాణ మంత్రులు మెచ్చుకున్నారు. విజయ్ ఇటీవల హైదరాబాద్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు హైదరాబాద్‌లో కేటీఆర్ ను కలిసి చూపించారు.
అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ ఈరోజు హైదరాబాద్‌లో మంత్రులు @KTRTRS, @DayakarRao2019, @SabithaindraTRS, @VSrinivasGoud సమక్షంలో తను నేసిన చీరను ప్రదర్శించారు. విజయ్ నేసిన ఈ అద్భుతమైన చీరను చూసి మంత్రులు అభినందించారు pic.twitter.com/r4tVA5GvZf
— KTR, Former Minister (@MinisterKTR) January 11, 2022