Weather Report: గత వారం రోజులుగా రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటను అకాల వర్షాలు ముంచెత్తాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలు చివరి దశకు చేరుకోనున్నాయని వెదర్ రిపోర్ట్ ఇచ్చింది. .
రాయలసీమ మరియు కోస్తాంధ్ర జిల్లాల్లో కురుస్తున్న అకాల-వర్షాల ప్రభావం తెలంగాణ జిల్లాల కన్నా చాలా తక్కువగా ఉంది .కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతం కురుస్తున్న అకాల-వర్షాలు మరొక 48 గంటలు వరకు కొనసాగి మే 4వ తేదీ నుండి క్రమంగా తగ్గుముఖం పడతాయి.
మే మొదటి వారంలో నైరుతి/దక్షిణ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి మోచ/మోఖా అనే తుఫాన్ గా మారి, ఉత్తర-ఈశాన్య దిశలో కదులుతూ బంగ్లాదేశ్/మయన్మార్ తీరాల వైపుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్లోబల్ మోడల్స్ అంచనా ప్రకారం. ఈ తుఫాన్ బంగ్లాదేశ్/మయన్మార్ తీరాల వైపుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇదే జరిగితే రెండు తెలుగురాష్ట్రాల్లో ఎండలు దంచికొట్టనున్నాయి. వేడి తీవ్రత పెరగనుంది. వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
Read More: ISIS: ఐసిస్ చీఫ్ హతం: టర్కీ అధ్యక్షుడు