Site icon HashtagU Telugu

Modi Warns KCR: కేసీఆర్ పై మోడీ అటాక్.. అవినీతి, కుటుంబ పాలన అంటూ వ్యాఖ్యలు!

Pm Modi

Pm Modi

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యుద్ధం’ చేస్తున్నందున తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. ‘‘తెలంగాణ పేరు చెప్పుకున్నవాళ్లు ధనవంతులు అయ్యారని, కానీ రాష్ట్రం మాత్రం వెనక్కు వెళ్లిపోయింది. అధికార పార్టీ నాయకులు అన్యాయానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రజలు అధికార పార్టీని నమ్మితే.. ఆ పార్టీ ప్రజలను మోసం చేసింది అని సీఎం కేసీఆర్ ప్రస్తావించకుండా మోడీ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అధికార టీఆర్‌ఎస్‌ను గద్దె దించి అధికారంలోకి రావాలనే తపనతో బీజేపీ ఉందని మోడీ అన్నారు.

ఎప్పుడైతే అన్నిటినీ చీకటి ఆక్రమిస్తుందో, అందులో నుంచి కమలం బయటపడుతుందని మోదీ అన్నారు. తెలంగాణలోనూ ఇదే జరుగబోతుందని మోడీ అన్నారు. ఇటీవల మునుగోడు ఉపఎన్నికపై ప్రధాని మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మొత్తం అసెంబ్లీనే మునుగోడుకు తీసుకొచ్చేలా చేశారని రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. “పెద్ద నాయకులను మోకాళ్లపై నిలబడేలా చేశారని, తెలంగాణ ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో ‘సూర్యోదయం’ ఎంతో దూరంలో లేదని, రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలన్నీ అందుకు నిదర్శనమని,  “తెలంగాణ మే హర్ తరఫ్ కమల్ కిలేగా” అని మోడీ నొక్కి చెప్పారు.

Also Read:  Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమ‌టిరెడ్డిపై తేల్చుడే.!

“రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో మూఢనమ్మకాలను ప్రేరేపిస్తుందో దేశం మొత్తం తెలుసుకోవాలి. తెలంగాణ ప్రగతి సాధించాలంటే మూఢనమ్మకాలను దూరం చేయాలి’’ అని కేసీఆర్ సెంటిమెంట్ పై మోడీ పంచులు వేశారు. రాష్ట్రానికి ‘కుటుంబం, రాజకీయాల కంటే ‘ప్రజలే ముఖ్యమని’ ప్రధాని కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. న్యాయం నుంచి తప్పించుకునేందుకు అవినీతి శక్తులు ఏకమవుతున్నాయని, తెలంగాణ ప్రజలకు అవగాహన ఉందని ప్రధాని అన్నారు. రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలు ప్రజలకు చేరువ కావాలని, కేంద్రం పథకాలు అందరికీ చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. “ఇతరులు నన్ను దుర్భాషలాడితే బాధపడకండి. ఆ మాటలను తేలిగ్గా తీసుకుని ఒక కప్పు టీ తాగు” అని మోడీ సలహా  ఇచ్చాడు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నదని ఆరోపించారు. ‘‘ఈ పథకం కింద పేదల కోసం దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను పంపిణీ చేశాం. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్నితొలగించింది. టీఆర్‌ఎస్‌ 2బీహెచ్‌కే హామీని నెరవేర్చలేదు, కేంద్రం ఇళ్లు పంపిణీ చేయనివ్వలేదు. నేడు తెలంగాణ ప్రగతిని కోరుకుంటోంది. బీజేపీ మాత్రమే దానిని అందించగలదని అన్నారు. తెలంగాణలోని రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన మోదీ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

Also Read:  Revanth Letter to Modi: ప్రధాని మోడీకి ‘రేవంత్’ లేఖాస్త్రం!