Telangana Voters List : తెలంగాణ ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల..మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉండగా..అందులో పురుషుల ఓటర్ల సంఖ్య 1,58,71,493గా

Published By: HashtagU Telugu Desk
Telangana Final Voters List

Telangana Final Voter List

తెలంగాణ (Telangana ) లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం (Telangana Election Commission) ఎన్నికలకు సంబదించిన పనులను స్పీడ్ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర తుదిఓటర్ల జాబితాను (Telangana Voters List Released) విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉండగా..అందులో పురుషుల ఓటర్ల సంఖ్య 1,58,71,493గా ఉండగా.. మహిళా ఓటర్ల సంఖ్య 1,58,43,339 కాగా ట్రాన్స్ జండర్ ఓటర్లు 2557 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 5.8 శాతం ఓట్లు పెరిగినట్లు పేర్కొంది.

మొత్తం ఓటర్ల సంఖ్య చూస్తే..

పురుష ఓటర్లు – 1,58,71,493
మహిళా ఓటర్లు – 1,58,43,339
ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు – 2,557
కొత్త ఓటర్ల సంఖ్య – 17.01 లక్షలు
తొలగించిన ఓట్లు – 6.10 లక్షలు
ఓటర్ల జాబితా లింగ నిష్పత్తి – 998:1000
మొత్తం ఓటర్లు – 3,17,17,389 తెలిపింది.

ఈ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే..ఈ లింక్ క్లిక్ చెయ్యండి.

  Last Updated: 04 Oct 2023, 06:19 PM IST