KTR In UAE: దుబాయ్ లో మగ్గుతున్న తెలంగాణ ఖైదీలు.. కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు

KTR In UAE: దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ దుబాయ్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పరిశ్రమలే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతున్నది.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, గొల్లెం నాంపల్లి, దుందుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు నేపాలీ మృతి కేసులో దుబాయ్‌లోని అవీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 15 సంవత్సరాలుగా వారు జైలులోనే మగ్గుతున్నారు. అక్కడి చట్టం ప్రకారం రూ.15 లక్షల పరిహారం అందజేయడానికి మృతుడి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు కేటీఆర్ గతంలో నేపాల్‌కు స్వయంగా వెళ్లారు. దాంతో బాధిత కుటుంబం యూఏఈ ప్రభుత్వానికి క్షమాభిక్ష పత్రాలను సమర్పించింది. అయితే కొన్ని కారణాల వల్ల నేర తీవ్రత కారణంగా దుబాయ్ ప్రభుత్వం క్షమాభిక్ష పిటిషన్‌ను ఆమోదించలేదు. ఆరు నెలల క్రితం మంత్రి కేటీఆర్ కేసు పురోగతిని అడిగి తెలుసుకుని ఐదుగురు కార్మికులను విడుదల చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.

దుబాయ్ పర్యటనలో ఉన్న కేటీఆర్ మరోసారి ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను భారత కాన్సుల్ అధికారులు మరియు దుబాయ్ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఐదుగురు దోషులు ఇప్పటికే 15 సంవత్సరాల శిక్షను అనుభవించారని అలాగే జైలు అధికారుల నుండి సత్ప్రవర్తన పత్రాన్ని కలిగి ఉన్నందున క్షమాభిక్ష పిటిషన్‌ను ఆమోదించాలని కేటీఆర్ యుఎఇ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే దుబాయ్ కోర్టు ఈ కేసును తిరస్కరించింది. యుఎఇ ప్రధాని షేక్ మహ్మద్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఆమోదించడంతో ఐదుగురు భారతీయులను స్వదేశానికి రప్పించాలని కెటిఆర్ అధికారులను కోరారు. ఈ కేసును ఛేదించడానికి ప్రత్యేక కృషి చేయాలని భారత కాన్సుల్ జనరల్ రామ్ కుమార్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు మరియు వ్యక్తిగత స్థాయిలో మరియు ప్రభుత్వం వైపు నుండి కూడా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Also Read: Beauty Tips: అందమైన మెరిసే ముఖం కోసం.. అరటి పండుతో ఇలా చేయండి?