Telangana Election Effect : అయోమయంలో తెలంగాణ నిరుద్యోగ యువత

తెలంగాణ నిరుద్యోగ (Telangana Unemployed) యువత కలలు ..'కల'గానే మిగులుతున్నాయి.

  • Written By:
  • Updated On - October 10, 2023 / 01:34 PM IST

తెలంగాణ నిరుద్యోగ (Telangana Unemployed) యువత కలలు ..’కల’గానే మిగులుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది..ఇక మనకు మంచి రోజులే అని ఎంతో ఆశపడ్డ నిరుద్యోగ యువతకు ఆ ఆశల ఫై ఎప్పటికప్పుడు ప్రభుత్వం , కోర్ట్ లు నీళ్లు చల్లుతూ వస్తున్నాయి. కష్టపడి రాసిన పరీక్షలు రద్దు అవుతూ ఉండడం..అధికారులు చేసిన నిర్లక్ష్యం వల్ల కోర్ట్ లు ఆ పరీక్షలను రద్దు చేస్తుండడం తో రేయిపగలు , నిద్రాహారాలు మని కష్టపడి పరీక్షా రాసిన యువతకు ఏంచేయాలో అర్ధం కావడం లేదు. ఓ పక్క పరీక్షల నిర్వహణ చేతకాక సన్నగిల్లిన టీఎస్‌పీఎస్సీ, మరోపక్క పోలీసు ఉద్యోగాల నియామకాల్లో కోర్టు కేసులు వెరసి.. నిరుద్యోగ యువత ఓర్పును పరీక్షిస్తున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1 పరీక్ష (Telangana Group 1) రెండుసార్లు రద్దయింది. పేపర్ లీక్ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ షెడ్యూలు మారాయి. గ్రూప్-2 పరీక్ష వాయిదాపడింది. గ్రూప్-4 ఫలితాలు వచ్చే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన తో రోజుల త్వరపడి కష్టపడుతూ వస్తుంటే ఈ నిర్లక్ష్యపు ప్రభుత్వాల వల్ల మా జీవితాలు ఆగమై పోతున్నాయని వారంతా వాపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా వచ్చిన కానిస్టేబుల్ ఫలితాలు (Telangana Constable Results) నిరుద్యోగుల్లో ఆనందం నింపాయి. చాలామంది త్తీర్ణులు కావడంతో వారి కుటుంబాల్లో సంతోషం నిండింది..కానీ ఈ సంతోషం ఎంతో సేపు లేకుండా చేసింది హైకోర్టు. కానిస్టేబుల్ ఫలితాలకు హైకోర్టు బ్రేక్ వేయడంపై ఎంపికైన అభ్యర్థులు షాక్ అవుతున్నారు. రాష్ట్రంలో ఏ పరీక్షలు సజావుగా సాగడం లేదని , ఒకవేళ అంత బాగుండు పరీక్షలు జరిగి , ఫలితాలు వస్తే..కోర్ట్ లు వాటికీ బ్రేక్ వేస్తున్నారని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రెండుసార్లు వాయిదాపడటం, గ్రూప్-2 (Telangana Group 2) పరీక్ష నిరవధిక వాయిదా పడగా.. గ్రూప్-4 ఫలితాలు (Telangana Group 4 Results) ఇంకా వెలువడలేదని మండిపడుతున్నారు.

ఇంతలో ఎన్నికల షెడ్యూలు వచ్చిందని, ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో లేనట్లేనని ఆవేదన చెందుతున్నారు. ఇక డీఎస్సీ పరీక్షలు (Telangana DSC Exam) కూడా జరుగుతాయో లేదో అని ఖంగారుపడుతున్నారు డీఎస్సీ అభ్యర్థులు. రాష్ట్రంలో నవంబరు 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. నవంబరు 30న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో నవంబరు నెలమొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉంటాయి. ఈ తరుణంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించడం అనేది అధికారులకు కత్తిమీద సాముగా మారింది. ఈ క్రమంలో పరీక్షా జరుగుతుందా..లేదా అనేది అర్ధం కావడం తో..దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన తెలియజేస్తామని విద్యాశాఖ చెప్పుకొస్తుంది. మరి పరీక్షా పెడతారా..లేదా..? అనేది అర్థంకాక అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.

Read Also : Varahi Yatra in Telangana : తెలంగాణలో పవన్ ‘వారాహి యాత్ర ‘..