Site icon HashtagU Telugu

Job Skills : జాబ్ స్కిల్స్‌లో తెలంగాణ, ఏపీ ర్యాంకింగ్స్ ఎంతో తెలుసా ?

Job Skills

Job Skills

Job Skills : దేశ ప్రజల్లో ఉద్యోగ నైపుణ్యాలపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), ఇతర ఆర్గనైజేషన్లతో కలిసి వీబాక్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. జాబ్ స్కిల్స్ కలిగిన 18 నుంచి 21 ఏళ్లలోపు యువతలో తెలంగాణ నంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది. ఈ  వయసులోని తెలంగాణ యువతలో 85.45 శాతం మందికి జాబ్స్‌కు తగిన అర్హతలు, నైపుణ్యాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.ఇక వయసుకు అతీతంగా జాబ్ స్కిల్స్ కలిగిన యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో హరియాణా(76.47%) ఫస్ట్ ప్లేస్‌లో, తెలంగాణ(67.79%)కు ఆరో ప్లేస్‌లో ఉంది. వీబాక్స్‌ సంస్థ నిర్వహించిన వీబాక్స్‌ నేషనల్‌ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌(వీనెట్‌)లో ఈవివరాలన్నీ వెల్లడయ్యాయి. ఈ టెస్టులో దేశవ్యాప్తంగా 3.88 లక్షల మంది(Job Skills) పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Dandruff: ఈ 5 ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే.. మీ చుండ్రు ఇట్టే తగ్గుతుంది..