Vande Bharat: దీపావళి నుంచి తెలంగాణలో వందే భారత్ రైలు పరుగులు.. విశేషాలివీ

తెలంగాణకు తొలి వందే భారత్ రైలు ఈ దీపావళికి రాబోతోంది. అయితే రూట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు.

  • Written By:
  • Publish Date - July 31, 2022 / 09:00 AM IST

తెలంగాణకు తొలి వందే భారత్ రైలు ఈ దీపావళికి రాబోతోంది. అయితే రూట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. హైదరాబాద్ నుంచి న్యూ ఢిల్లీ రూట్‌లో లేదా హైదరాబాద్- విశాఖపట్నం రూట్‌లో ఇది నడిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీపావళికి ముందు.. రెండు నెలల పాటు ట్రయల్ రన్ జరగనుంది. ఆగస్ట్ రెండో వారం తర్వాత ట్రయల్ రన్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. కోటా నగ్డా సెక్షన్‌లో ట్రయల్ రన్ జరుగుతుంది. దీపావళి నుంచి తెలంగాణలో వందే భారత్ రైలు
కమర్షియల్ రన్ ప్రారంభమ వుతుంది. భారతీయ రైల్వే 2023 ఆగస్ట్ 15 నాటికి 75 వందే భారత్ రైళ్లను, మూడేళ్లలో 400 వందే భారత్ ట్రైన్స్ నడపాలన్నది భారతీయ రైల్వే లక్ష్యం. ఈ లెక్కన వచ్చే ఏడాది నాటికి తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ధి రైళ్లను వందే భారత్ ట్రైన్స్‌తో రీప్లేస్ చేయాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

విస్తరణ ప్రణాళికలు

* ఇప్పటికే మన దేశంలోని రెండు రూట్లల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.
* న్యూఢిల్లీ- వారణాసి, న్యూఢిల్లీ-మాతా వైష్ణో దేవి కాట్రా రూట్‌లో ఇవి రాకపోకలు సాగిస్తున్నాయి.
* చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ,కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ, రాయ్ బరేలీలోని మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్ల కోచ్‌లు తయారవుతున్నాయి.
* చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నెలకు ఆరు నుంచి ఏడు వందే భారత్ రైళ్లు సిద్ధం అవుతున్నాయి. ఈ కెపాసిటీని పదికి పెంచాలని భావిస్తున్నారు.
* ఇటీవల 200 వందే భారత్ రైళ్లకు కేంద్రం టెండర్లను ఆహ్వానించింది. టెండర్లు దాఖలు చేసేందుకు డెడ్‌లైన్‌ను జూలై 26 నుంచి అక్టోబర్ 10కి పొడిగించింది.

ట్రైన్ ప్రత్యేకతలు..

* వందే భారత్ రైళ్లల్లో అన్ని బోగీలు ఏసీవే ఉంటాయి.
* వందే భారత్ ట్రైన్ లు కొన్నింటిలో 16, 20, 24 చొప్పున బోగీలు ఉంటాయి.
* 16 బోగీలు ఉన్న వందే భారత్ ట్రైన్ లో 11 థర్డ్ ఏసీ కోచ్‌లు, 20 బోగీలు ఉన్న వాటిలో 15 థర్డ్ ఏసీ కోచ్‌లు, 24 బోగీలు ఉన్న వాటిలో 19 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. వీటితో పాటు 4 సెకండ్ ఏసీ కోచ్‌లు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.
* అన్ని స్లీపర్ కోచ్‌లలో రీడింగ్ లైట్స్, బాటిల్ హోల్డర్, ప్రతి సీటుకు USB, ల్యాప్‌టాప్ కమ్ మొబైల్ ఛార్జింగ్ సాకెట్ లాంటి ఫీచర్స్ ఉంటాయి.
* థర్డ్ ఏసీలో నలుగురు ప్రయాణికులు, సెకండ్ ఏసీలో ప్రయాణికులు షేర్ చేసుకోవడానికి వీలుగా స్నాక్ టేబుల్స్ ఉంటాయి.
* ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ప్రతీ ప్యాసింజర్‌కు స్నాక్ టేబుల్ ఉంటుంది. ప్రతీ క్యాబిన్‌కు ఎల్‌సీడీ డిస్‌ప్లే కూడా ఉంటుంది.
* ఇతర ఫీచర్స్ చూస్తే టాయిలెట్లలో హెల్త్ ఫాసెట్, ఆటోమేటెడ్ టాయిలెట్ ఫ్లషింగ్, వాటర్ ట్యాప్‌తో వాష్ బేసిన్, ప్రతి కోచ్‌లో ఆటోమేటిక్ ఇంటర్నల్ డోర్స్, CCTV కెమెరా, GPS తో పనిచేసే ప్రయాణీకుల సమాచార వ్యవస్థ, Wi-Fi ద్వారా పనిచేసే ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటాయి.
* ప్రతి కోచ్‌లో డిస్‌ప్లే బోర్డులు, ప్రతి కోచ్ డోర్‌వే పైన రెండు అదనపు LED డిస్‌ప్లేలు ఉంటాయి.