Site icon HashtagU Telugu

Miss World Pageant: తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. ఎప్పుడంటే?

Miss World Pageant

Miss World Pageant

Miss World Pageant: ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక అందాల పోటీ మిస్ వరల్డ్ 72వ ఎడిష‌న్‌కు (Miss World Pageant) తెలంగాణ వేదిక కానుంది. నివేదికల ప్ర‌కారం మిస్ వ‌రల్డ్ 72వ ఎడిష‌న్ తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్నాయి. మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు ఈ ఏడాది మే 7 నుంచి మే 31 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు పేర్కొన్నారు. ఈ ఈవెంట్ 4 వారాల పాటు తెలంగాణలో జ‌ర‌గ‌నుంది. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. బుధవారం తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి ర్శి స్మితా సభర్వాల్‌తో పాటు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ CBE ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు.

ఈ సంద‌ర్భంగా మిస్ వ‌ర‌ల్డ్ సీఈవో జూలియా మోర్లీ మాట్లాడుతూ.. తెలంగాణ గొప్ప సంస్కృతి ఉన్న రాష్ట్రం. ఈ ఈవెంట్‌కు తెలంగాణ ప్రభుత్వంలో జ‌త‌క‌ట్ట‌డం ప్ర‌పంచంలో ఉన్న వీక్ష‌కుల‌ను తెలంగాణ రాష్ట్ర వృద్ధి, వారసత్వాన్ని చూడనుందని అన్నారు. అలాగే ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మ‌ద్ద‌తు అద్భుత‌మ‌ని కొనియాడారు.

Also Read: Hydra: ద‌ళిత‌వాడ‌కు దారి దొరికింది.. దేవ‌ర‌యాంజల్‌లో ప్ర‌హ‌రీని తొల‌గించిన హైడ్రా!

మిస్ వ‌రల్ట్ పోటీల‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వ‌డం చాలా గ‌ర్వంగా ఉంద‌ని తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి స్మితా స‌భ‌ర్వాల్ పేర్కొన్నారు. మిస్‌ వరల్డ్ వేడుక‌ల‌తో తెలంగాణ గొప్పదనం ఏంటో ప్ర‌పంచానికి తెలుస్తుంద‌ని అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్ కోసం మాత్రమే కాకుండా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ అనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అనేక దేశాల ప్రతినిధులు మే 7వ తేదీన తెలంగాణ వ‌స్తార‌ని పేర్కొన్నారు. ఈ మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు 120పైగా దేశాల నుంచి యువ‌తులు పాల్గొన‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు.