Nalgonda IT Hub: తెలంగాణాలో జిల్లాకో ఐటి హబ్ ఏర్పాటవుతుంది. ఐటి పరంగా హైదరాబాద్ ఉరుకులు పెడుతుంది. ఈ నేపథ్యంలో ఐటీని అన్ని జిల్లాలో అభివృద్ధి చేసేవిధంగా ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పూనుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాలో ఐటి హబ్ లను ఏర్పాటు చేశారు. తాజాగా నల్గొండ జిల్లాలో మరో ఐటీ హబ్‌ను నిర్మిస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. టైర్ 2 పట్టణాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, సిద్దిపేట, నిజామాబాద్ తర్వాత ఇప్పుడు నల్గొండలో ఐటి హబ్ నిర్మితమవుతున్నట్టు కేటీఆర్ చెప్పారు. .నల్గొండ జిల్లాలో ఐటీ హబ్ నిర్మాణం మరికొద్ది వారాల్లో పూర్తవుతుందని టైమ్‌లైన్‌ను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. టైర్-2 పట్టణాలకు ఐటీని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. రెండేళ్ల క్రితం వరకు ఐటీ హైదరాబాద్‌కే పరిమితమైందని కేటీఆర్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
Als Read: Bapatla Road Accident : బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి