Paddy Issue : వ‌రి ధాన్యం రాజ‌కీయానికి తెర‌! మిల్ల‌ర్ల‌కు కేసీఆర్ శుభ‌వార్త‌!!

వ‌రి పంట వేయొద్ద‌ని ప్ర‌చారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల వేళ మ‌న‌సు మార్చుకున్నారు. రైతుల‌ను ప్రోత్స‌హిస్తూ మిల్ల‌ర్ల‌కు మేలు చేకూరేలా సంచ‌ల‌న నిర్ణ‌యం ఆయ‌న తీసుకున్నారు

  • Written By:
  • Updated On - November 29, 2022 / 12:40 PM IST

వ‌రి పంట వేయొద్ద‌ని ప్ర‌చారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల వేళ మ‌న‌సు మార్చుకున్నారు. రైతుల‌ను ప్రోత్స‌హిస్తూ మిల్ల‌ర్ల‌కు మేలు చేకూరేలా సంచ‌ల‌న నిర్ణ‌యం ఆయ‌న తీసుకున్నారు. అంతేకాదు, మిల్ల‌ర్ల కు లాభం చేకూరేలా జీవోల‌ను వెంట‌నే జారీ చేసేలా ఆర్డ‌ర్ వేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఏడాది కాలంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ న‌డిపిన వ‌రి ధాన్యం కొనుగోళ్ల రాజ‌కీయ ఎపిసోడ్ కు తెర‌ప‌డింది. ఇత‌ర రాష్ట్రాల‌కు బియ్యం ఎగుమ‌తి చేయ‌డం ద్వారా వ‌రి పండించే రైతుల‌ను ఆదుకోవాల‌ని నిర్ణ‌యించారు. రెండు శాతం విధిస్తోన్న సెంట్ర‌ల్ సేల్స్ ట్యాక్స్ బ‌కాయిల‌ను మాఫీ చేస్తూ మిల్ల‌ర్ల‌కు తెలంగాణ స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది.

ముడిసరుకును బియ్యంగా మార్చడం ద్వారా ఇతర రాష్ట్రాలకు వరి ఎగుమతులను ప్రోత్సహిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర రైతుల కంటే మిల్ల‌ర్ల‌కు పంట పండింది. ఇతర రాష్ట్రాలకు వ‌రి ఎగుమతులు చేయ‌డానికి విధించే 2 శాతం సీఎస్టీ (సెంట్రల్ సేల్స్ ట్యాక్స్) బకాయిలను కూడా మాఫీ చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం మిల్ల‌ర్ల జేబుల‌ను నింపనుంది. బియ్యం ఎగుమతులను ప్రోత్సహించ‌డంతో రైతులకు ప్రయోజనం క‌లుగుతుంద‌ని సీఎం సూత్రీక‌రిస్తున్నారు.

గతంలో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి విషయంలో ఫారం సి దాఖలు చేస్తే సిఎస్‌టి బకాయిలపై 2 శాతం రాయితీ కల్పించే విధానం ఉండేది. బియ్యం ఎగుమతి అయ్యాయా లేదా అని సరిచూసుకోవడమే సి ఫారం ఉద్దేశమని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఫారం సి బదులు ఎగుమతులను ధృవీకరించడానికి ఇతర పద్ధతులను పరిశీలించాలని మిల్ల‌ర్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. లోడింగ్, విడుదల, సర్టిఫికేట్లు, లారీలు, రైల్వే పర్మిట్లు, వే బిల్లులు వంటి త‌దిత‌రాల‌ను సమర్పించే వెసుల‌బాటు క‌ల్పించాల‌ని స్థానిక ప్ర‌జాప్రతినిధుల‌ను మిల్ల‌ర్లు కోరారు.

దామరచర్లలో కేసీఆర్ పర్యటన సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి, మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్‌రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి తెలంగాణ రైస్‌మిల్లర్ల సంఘం ప్రతినిధులు సీఎంను కలిసి న్యాయం చేయాలని విన్నవించారు. వాళ్ల‌ అభ్యర్థనను పరిశీలించిన సీఎం సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైస్ మిల్లర్లకు మాత్రమే కాకుండా తెలంగాణ రైతులకూ మేలు చేస్తుందని భావివంచారు.అందుకే, వెంట‌నే రైస్ మిల్ల‌ర్ల సమస్యలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఆ మేర‌కు వెంటనే జీవో జారీ చేయ‌డంతో మిల్ల‌ర్లు సంబ‌రాలు చేసుకుంటున్నారు.