తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అత్యంత విలువైన భూములను వేలం (Telangana GOVT Auction) వేయాలని నిర్ణయించింది. గచ్చిబౌలిలో 400 ఎకరాల (400 acres) భూమిని వేలం వేయడం ద్వారా దాదాపు రూ. 30,000 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భూముల లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి కన్సల్టెంట్ల నుండి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ప్రతిపాదనలు కోరింది.
Mayuri Kango : ఒకప్పుడు నటిగా ఫెయిల్… ఇప్పుడు గూగుల్ ఇండియా మేనేజర్
ఈ వేలంపాట ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. త్వరలోనే ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేలం ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఈ నెల 15 వరకు బిడ్లను దాఖలు చేసేందుకు గడువు విధించింది. వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 0.003 శాతం సదరు కన్సల్టెంట్ సంస్థకు వాటాగా ఇవ్వనుంది.
అయితే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ భూములను వేలం వేయడం పట్ల తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే విధానాన్ని అనుసరించడంపై వివాదాస్పద చర్చ జరుగుతోంది. అప్పట్లో ప్రభుత్వ భూముల వేలం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆస్తులు తగ్గిపోతాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమని విమర్శించిన రేవంత్, ఇప్పుడు పరిస్థితులు మారడంతో ప్రభుత్వానికి నిధులు సమకూర్చడానికి ఇదే మార్గాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.
Posani : కర్నూలు జైలుకు పోసాని తరలింపు
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం భారీగా నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములను వేలం వేయడం తప్పనిసరి అయింది. అయితే భూముల అమ్మకం ద్వారా సమకూరే నిధులను ప్రజా సంక్షేమ పథకాల కోసం మాత్రమే వినియోగించాలనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వేలంపాట ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.