Site icon HashtagU Telugu

TG TET 2024 Exam : తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

Supplementary exam results

Supplementary exam results

TG TET 2024 Exam : తెలంగాణలో టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. టెట్ పరీక్షలు జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్ర‌తి రోజు రెండు సెష‌న్లు అంటే సెష‌న్ – 1 ఉద‌యం 9 గంట‌ల నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు, సెష‌న్ -2 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 4.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. పేప‌ర్-1 ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 8, 9, 10, 18 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. పేప‌ర్ -2 ప‌రీక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

జ‌న‌వ‌రి 2వ తేదీన ఉద‌యం, మ‌ధ్యాహ్నం సెష‌న్ల‌లో సోష‌ల్ స్ట‌డీస్(పేప‌ర్-2) ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌వ‌రి 5న ఉద‌యం సెష‌న్‌లో సోష‌ల్ స్ట‌డీస్(పేప‌ర్ -2), మ‌ధ్యాహ్నం సెష‌న్‌లో మ్యాథ‌మేటిక్స్ అండ్ సైన్స్(పేప‌ర్-2) ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

టీచర్ జాబ్స్ కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం నిర్వహించే టెట్ పరీక్షలకు ఈసారి 2 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ముందుగా జనవరి 1 నుంచి టెట్ పరీక్షలు 2025 ప్రారంభం అవుతాయి అని అంతా అనుకున్నారు. తాజాగా టెట్ పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ విడుదల చేసింది.

ఇటీవల తెలంగాణ టెట్‌ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ (మొత్తం 15 పేపర్లు)ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై.. 11. 30 గంటలకు ముగుస్తుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై.. 04.30 గంటలకు పూర్తవుతుంది. అనంతరం ప్రిలిమినరీ కీ, ఫైనల్‌ కీ విడుదల చేసి.. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలు ప్రకటిస్తారు. ఈసారి టెట్ పరీక్షకు మొత్తం 2,48,172 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులోనూ పేపర్‌-1కు 71,655 అప్లికేషన్లు రాగా.. పేపర్‌-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి.

Read Also: Uniform Civil Code: జనవరి నుంచి ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమల్లోకి : సీఎం ధామి