Site icon HashtagU Telugu

Rahul Gandhi : కేసీఆర్ కు రాహుల్ ట్విస్ట్..!!

Rahul Gandhi

Rahul Gandhi

తెలంగాణలో రాజకీయ వేడి రగులుతోంది. ఎన్నికలు రేపోమాపో అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. ఓ వైపు అధికారపార్టీ ఎత్తుగడలు…మరోవైపు ప్రతిపక్ష పార్టీల కౌంటర్ అటాక్స్…వెరసి…తెలంగాణ రాజకీయం మాంచి జోరుమీదుంది. ఈ సమయంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం…అన్ని పార్టీలకు తమ రాజకీయ వైఖరిని తెలిపే సందర్భంగా మారింది. అధికారపార్టీ ఆవిర్భావ సంబురాలు జరుపుతుండగా…ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో టీఆరెస్ ను టార్గెట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన శుభాకాంక్షలు తెలియజేశారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా టీఆరెస్ వైఖరిపై ఘాటుగానే స్పందించారు. తమ పోరాట స్పూర్తితో యావత్ దేశానికి స్పూర్తిదాయకమైన తెలంగాణ సోదరిసోదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు. ఈ చారిత్రాత్మక రోజున అమరవీరులు వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందామంటూ రాహుల్ తెలుగులో ట్వీట్ చేశారు. దీనికి కొనసాగింపుగా రాహుల్ చేసిన ట్వీట్లలో టీఆరెస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

8ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం టీఆరెస్ పాలనలో దారుణమైన పాలనను చూసిందంటూ మరో ట్వీట్ చేశారు. #TelanganaFormationDay నాడు ముఖ్యంగా రైతులు కార్మికులు పేదలు, సామాన్య ప్రజలకు శ్రేయస్సు తీసుకురావడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ నిబద్ధతను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను” అని తమ వైఖరిని తెలియజేశారు రాహుల్ గాంధీ. కాగా ఈ ట్వీట్లకు టీఆర్ఎస్ పార్టీ సానుభూతి వర్గాలు కూడా తమదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చాయి.