Site icon HashtagU Telugu

Hyderabad Airport Alert: ఇలా చేస్తే తెలంగాణాలో థర్డ్ వేవ్ రాదన్న ఆరోగ్యమంత్రి హరీష్ రావు

Gallery Image 11 Imresizer

Gallery Image 11 Imresizer

హైదరాబాద్ :దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రభావం తెలంగాణాలో ఎలా ఉంటుందనే అంశంపై ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు, ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దక్షిణాఫ్రికా తో పాటు వేరియంట్ విస్తరిస్తోన్న ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ లో కఠినమైన స్క్రీనింగ్ నిర్వహించి పాటు, వారిని హోమ్ క్వారైన్ టైన్ లో ఉంచడం, పాజిటివ్ వస్తే ఆ శాంపిల్ ను జినోమ్ సిక్వెన్స్ కు పంపాలని మంత్రి హరీష్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దక్షిణాఫ్రికా వేరియంట్ ఒమిక్రాన్ పై రాష్ట్రాలను కేంద్రం అలెర్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కట్టడకి తీసుకోవాల్సిన చర్యలతో పాటు కరోనా కట్టడిలాగే వేరియంట్స్ ను కట్టడి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇతర దేశాల నుంచి ప్రయాణికుల ద్వారా వస్తోన్న వేరియంట్స్ ను ఎయిర్పోర్ట్ సర్వైలైన్స్ ద్వారా కట్టడి చేయాలనే ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.

దక్షిణాఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్ కు విమాన సర్విస్ లేకపోయినప్పటకీ ఇతర రాష్ట్రాల్లో దిగి, ఇక్కడకు ప్రయాణికులు వస్తారు కాబట్టి వారందరికీ కఠినమైన స్క్రీనింగ్ చెయ్యాలని అధికారులకు మంత్రి హరీష్ సూచించారు. దక్షిణాఫ్రికా తో పాటు.. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను స్క్రిని0గ్ చేసి, హోమ్ క్వారైన్ టైన్ లో ఉంచాలన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొందుకు టెస్ట్ కిట్స్ నుంచి బెడ్స్ వరకు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు తెలిపారు. ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో కొత్త వేరియంట్ కేసులు ఇంకా నమోదు కాలేదని, కొత్త వేరియంట్ రాకుండా అడ్డుకునేలా ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ పెంచడం జరిగిందన్నారు.

కొత్త రకం వెరియంట్ ఎంత ప్రమాదకరం అనే అంశమై పరిశోధనలు జరుగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందకుండా తన వంతుగా జాగ్రత్తలు పాటించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. థర్డ్ వేవ్ రాకూడదంటే అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

Exit mobile version