SSC exams: విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. టెన్త్ ఎగ్జామ్ పాటర్న్ చేంజ్!

రాబోయే SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022కుగానూ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Ssc

Ssc

రాబోయే SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022కుగానూ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది. ఆబ్జెక్టివ్ పార్ట్ లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా, కొంతవరకు సవరించి ప్రశ్న పత్రాల థియరీ విభాగాలకు విస్తరించబడ్డాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. “మొత్తంమీద, ఈ సంవత్సరం SSC పరీక్షలలో ప్రశ్నల్లో (20 ప్రశ్నలు ఉంటే, అందులో పదింటికి మాత్రమే జవాబులు రాసేలా) 50 శాతం ఎంపిక ఉంటుంది. మోడల్ ప్రశ్న పత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ఒక అధికారి తెలిపారు. ముందుగా ప్రకటించినట్లుగా, SSC పరీక్షలు 2022 అన్ని సబ్జెక్టులలో మొత్తం సిలబస్‌లో 70 శాతం మాత్రమే నిర్వహించబడతాయి. సాధారణ 11 పేపర్‌లకు బదులుగా ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి.

పరీక్షలు మే 11న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్-A), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-I (కాంపోజిట్ కోర్సు) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్సు)తో ప్రారంభమవుతాయి. SSC పరీక్షలు మే 17న సోషల్ స్టడీస్ పేపర్‌తో ముగుస్తాయి. సంస్కృతం, అరబిక్, SSC వొకేషనల్ కోర్సులకుగాను వరుసగా మే 18, 19, 20 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ముగిసిన 30 నిమిషాల్లో అన్ని సబ్జెక్టుల్లోని ఆబ్జెక్టివ్ పేపర్‌లకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు 4.81 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14తో ముగియగా, ఎగ్జామ్ ఫీజు రూ. 50 రూ. 200 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 24 వరకు, మార్చి 4 వరకు చెల్లించవచ్చు. గతేడాది దాదాపు 5.16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించబడలేదు. విద్యార్థుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు.

  Last Updated: 18 Feb 2022, 01:28 PM IST