Telangana Awards: స్వచ్ఛ భారత్ దివస్ లో ‘తెలంగాణ’కు అవార్డుల పంట!

న్యూఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రానికి 'స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ' కింద 13 అవార్డులతో పాటు

  • Written By:
  • Updated On - October 3, 2022 / 01:07 PM IST

న్యూఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రానికి ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ’ కింద 13 అవార్డులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని కుళాయి కనెక్షన్‌ల నియంత్రణ కార్యాచరణకు అవార్డును అందజేయడంతో తెలంగాణకు అవార్డుల పంట పండింది. ‘స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ్’ అవార్డుల సంఖ్య 14కి చేరుకుంది. 60 శాతం కంటే ఎక్కువ కుళాయి కనెక్షన్ కవరేజీ ఉన్న రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్లు ఏర్పాటుచేసినందుకుగానూ తెలంగాణను కేంద్రం మొదటి ర్యాంక్‌తో సత్కరించింది.

జల్ జీవన్ మిషన్‌కు చెందిన తాగునీరు, పారిశుద్ధ్య విభాగం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద ఈ అవార్డును అందించింది. ఈఎన్సీ కృపాకర్ రెడ్డి నేతృత్వంలోని మిషన్ భగీరథ బృందం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ చేతుల మీదుగా అవార్డును అందుకుంది. తెలంగాణ కూడా ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2021-22’లో లార్జ్ స్టేట్స్ కేటగిరీలో అత్యున్నత పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఓవరాల్ టాప్ జిల్లాల విభాగంలో జాతీయ స్థాయిలో జగిత్యాల ద్వితీయ, నిజామాబాద్ మూడో స్థానంలో నిలవగా, సౌత్ జోన్ ఓవరాల్ టాప్ జిల్లాల విభాగంలో నిజామాబాద్ రెండో స్థానంలో, భద్రాద్రి-కొత్తగూడెం మూడో స్థానంలో నిలిచాయి.

‘బయోడిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌’, గోబర్ధన్‌, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్‌, స్లడ్జ్ మేనేజ్‌మెంట్‌ లాంటి విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించాయి. గ్రామపంచాయతీల జాతీయ చలనచిత్ర పోటీ విభాగంలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామపంచాయతీ జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది.