హైదరాబాద్, తెలంగాణ। తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ (Local Body Elections) నిర్వహించేందుకు కసరత్తు వేగంగా కొనసాగుతోంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లే నిర్ణయాన్ని కేబినెట్ ఇప్పటికే తీసుకుంది. బీసీలకు 42% సీట్లు (42% seats for BCs) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ చేసింది. రిజర్వేషన్లు 50% దాటకూడదన్న గైడ్‌లైన్స్ (guidelines) కూడా విడుదల చేశాయి.
ఈ నెల 25న జరగబోయే కేబినెట్ మీటింగ్‌కు ముందే రిజర్వేషన్లపై పూర్తి జీవో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. లోకల్ ఎన్నికలకు అవసరమైన అన్ని ఫార్మాలిటీలను కేబినెట్ జరిగే నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని సజావుగా జరిగితే ఈ నెల 26 లేదా 27న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి రెండో వారం మధ్యలో మొత్తం ప్రక్రియను ముగించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలను పంచాయతీ ఎన్నికల్లో కూడా రీపీట్ చేయాలనే లక్ష్యంతో పార్టీ కొత్త డీసీసీల నియామకం కూడా పూర్తి చేసింది. కొత్త లీడర్‌షిప్‌తో క్యాడర్‌ను ఉత్తేజపరుస్తూ మంచి ఫలితాల కోసం కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
పంచాయతీ ఎన్నికల ముందు అన్ని విభాగాల్లో మార్పులు చేస్తూ రేవంత్ ప్రభుత్వం కదిలింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారుల పనితీరుపై సమగ్ర రిపోర్ట్ తెప్పించుకుని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. కొందరు సీనియర్ IASల స్థానచలనం ఖాయం కాగా, ఎప్పుడైనా కొత్త ఉత్తర్వులు రావచ్చు. ఇప్పటికే 32 మంది IPSలు, 9 మంది నాన్ క్యాడర్ SPల బదిలీ జరగగా, మరో కొన్ని జిల్లాల కలెక్టర్ల మార్పులకు కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకానికి సిద్ధమవుతోంది.
త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ అనూహ్య నిర్ణయాలు, పరిపాలనా మార్పులు తెలంగాణ రాజకీయ వేడిని పెంచుతున్నాయి.
