Corona Cases: తెలంగాణలోని 17 జిల్లాల్లో జీరో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్నాయి.
గత 24 గంటల వ్యవధిలో 23,888 మంది నమూనాలను పరీక్షించగా అందులో కేవలం 105 మందికి మాత్రమే కరోనా సోకినట్లు తేలిందని ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ వెల్లడించింది.

తాజాగా బయటపడ్డ 105 కరోనా కేసులతో ఇప్పటి వరకు తెలంగాణాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,73,574కు చేరింది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 106 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వైరస్ నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,65,861కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3,740 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.85 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంది.

Also Read: గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్. 26 మంది మావోయిస్టులు హతం, మృతుల్లో కేంద్ర కమిటీ

గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 59 కేసులు నమోదవ్వగా, 17 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ఇక మిగతా జిల్లాల్లో కేవలం సింగిల్ డిజిట్ కేసులు మాత్రమే ఉన్నాయి.

ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఈ రాష్ట్రాన్ని తొందర్లోనే కరోనా ఫ్రీ తెలంగాణగా చూడొచ్చు.

Also Read : ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై అంతర్జాతీయ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించిన షారుఖ్

  Last Updated: 19 Jan 2022, 07:41 PM IST