Site icon HashtagU Telugu

Ramappa Temple:తెలంగాణ విశిష్టతను తొక్కిపెట్టారు. త్వరలో దానికి కూడా ప్రపంచస్థాయి గుర్తింపు

ప్రపంచం మెచ్చుకునే వందలాది ప్రాంతాలు తెలంగాణాలో ఉన్నాయని, గత పాలకులు తెలంగాణ విశిష్టత తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు రావడంపట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పోచంపల్లిలో నేసే ఇక్కత్‌ చీరలకు ప్రపంచమంతా ఫిదా అయిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పోచంపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కోరారు.

రామప్ప ఆలయ అభివృద్ధికి కూడా కేంద్రం రూ.300 కోట్లు ఇవ్వాలన్నారు. ఈ ఏడాది రామప్ప ఆలయానికి, పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, త్వరలోనే బుద్ధవనం ప్రాజెక్టుకు కూడా ప్రపంచ గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని మరిన్ని ప్రదేశాలకు ప్రపంచ గుర్తింపు తేవడం కోసం కృషి చేస్తామని, దానికి కేంద్రం సహకరించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.

&nbsp

Exit mobile version