తెలంగాణలో ఆదిమానవుడి ఆనవాళ్లు.. ఇదిగో సాక్ష్యం.!

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కతున్నా.. ఇప్పటికీ అంతుపట్టని రహస్యలెన్నో మన చుట్టు ఉన్నాయి. ఈ విశాల విశ్వంలో అరుదైన కట్టడాలు, ప్రాంతాలు చాలానే ఉన్నాయి. తవ్వేకొద్దీ ఎన్నో విషయాలు వెలుగుచూస్తుంటాయి.

  • Written By:
  • Updated On - October 18, 2021 / 02:27 PM IST

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కతున్నా.. ఇప్పటికీ అంతుపట్టని రహస్యలెన్నో మన చుట్టు ఉన్నాయి. ఈ విశాల విశ్వంలో అరుదైన కట్టడాలు, ప్రాంతాలు చాలానే ఉన్నాయి. తవ్వేకొద్దీ ఎన్నో విషయాలు వెలుగుచూస్తుంటాయి. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో గత చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లెన్నో అడుగడుగునా కనిపిస్తాయి. అలాంటివాటిలో చెప్పుకోదగినవి ఈ నిలువురాళ్లు. ఇప్పటికే తెలంగాణలోని రామప్ప ఆలయం యూనెస్కో గుర్తింపు సాధించగా, ఈ నిలువురాళ్లు కూడా ముందుముందు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు సాధించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. చూసేందుకు ఈ రాళ్లేకానీ.. గత చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లును కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి.

తెలంగాణ లోని నారాయపేటలోని ముడుమాల్ గ్రామ శివారులో అడుగు పెడితే.. దాదాపు 14 అడుగుల ఎత్తున్న నిలువురాళ్లు కనిపిస్తాయి. అంతేకాదు.. ఈ రాళ్ళతో పాటు వృత్తాకార నిర్మాణాలలో ఉంచిన చిన్న రాళ్లు 80 ఎకరాల విస్తీర్ణంలో వేలాది బండరాళ్లు కనిపిస్తాయి. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు సాధించేందుకు కావాల్సిన అన్ని అర్హతలు దీనికి కూడా ఉన్నాయి. ఆ గ్రామ యువకులు కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఈ నిలువురాళ్లను కాపాడుతూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మెగాలిథిక్-యుగం గా అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్, 2003 నుంచి మెన్హిర్‌ల(మానవ నిర్మిత ప్రాంతం)పై పరిశోధన చేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలలో అనేక పరిశోధనా పత్రాలను సమర్పించారు. పురావస్తు సంబంధాలే కాకుండా, ఈ రాళ్లకు ఖగోళ ప్రాముఖ్యత కూడా ఉందని ఆయన చెప్పారు.

గతంలో ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో సమాధులు ఉండేవని, వాటికి చెందిన పెద్దపెద్ద రాతి గుండ్లను స్థానికులు ఇళ్ల నిర్మాణం కోసం తరలించారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాటిని ధ్వంసం చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని కాపాడి చరిత్రను భావితరాలకు అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరిచందన ఈ నిలువురాళ్ల గురించి ప్రస్తావించారు. గత చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తున్నాయని, వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ఫొటోలతో సహ ట్వీట్ చేయడంతో మరోసారి చర్చనీయాంశమైంది.

ఆకాశంలోని నక్షత్ర సమూహాల్లో సప్తర్షి మండలంగా భావించే ఆకృతి ఇక్కడి ని లువు రాళ్లపై గుర్తించారు. సూర్యుడి గమనం ఆధారంగా పడుతున్న ఈ రాళ్ల నీడల ను బట్టి, వాతావరణ సమయాలను శిలాయుగంలో గుర్తించే వారని అధ్యయనంలో పేర్కొన్నారు. నీడలు ఓ క్రమంలో, ఓ నిర్ధిష్ఠ ప్రాంతంలో పడటం మొదలవగానే రు తువులు మొదలవుతాయని చెబుతున్నారు. ఈ నిలువు రాళ్ల నీడలు మరో క్రమంలోకి మారుతూ వెళితే వానాకాలంగా గుర్తించి, ఆ నీడల ఆధారంగా పంటల సాగు, పరిస్థితిని అంచనా వేసే వారని అధ్యయనకారులు చెప్తున్నారు. ఇక్కడి ఆది మానవుడి ఆనవాళ్లతో పాటు సమాధులు కూడా ఉన్నాయి.