Bhatti Vikramarka : రాష్ట్రంలో ప్రతి పౌరుడు సురక్షితంగా జీవించేందుకు ప్రభుత్వంతో పాటు పోలీసులు బాధ్యతగా పని చేస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం సచివాలయంలో హోంశాఖ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగరాలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో మూడు నగరాలు ఉన్న సంగతి తెలిసిందే, ఇక నాలుగవ నగరం ఫ్యూచర్ సిటీ కూడా సిద్ధమవుతోంది. రీజినల్ రింగ్ రోడ్డు పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
Israel-Hamas : మరో ఆరుగురు బందీలను విడుదల చేయనున్న హమాస్
రాష్ట్రంలో వృద్ధి , ఆర్థిక వనరుల పెరుగుదల, వాతావరణం, ఉపాధి అవకాశాల కారణంగా హైదరాబాద్‌కు , రాష్ట్రానికి వలసలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో భద్రతా చర్యలు మరింత పటిష్టం కావాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఆయన, సరిహద్దుల వద్ద సమస్యలు ఉండవచ్చు కాబట్టి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం తేవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆశ్వాసించారు.
ఈ సందర్భంగా, తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం విషయంలో తెలంగాణ పోలీసులు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, దీనికి సంబంధించి పోలీసు అధికారులు , సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. పోలీసు సిబ్బందికి క్వార్టర్స్ నిర్మించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో ఎక్కడి క్వార్టర్స్ అవసరమున్నాయో వెంటనే ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం సూచించారు.
అలాగే, సీఎస్ఆర్ నిధులను సమీకరించేందుకు అన్ని అవకాశాలు ఉపయోగించాలని, వాటిని పోలీసు శాఖ బలోపేతానికి వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో పోలీసు శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య, ఖాళీల వివరాలపై సమీక్ష నిర్వహించారు. గ్రేహౌండ్స్, నార్కోటిక్స్, ఇంటలిజెన్స్, ఫైర్, ఎక్స్ సర్వీస్ మెన్ వంటి విభాగాల ఉన్నతాధికారులు తమ బడ్జెట్ అవసరాలపై నివేదికలు సమర్పించారు. డిజిపి జితేంద్ర కూడా మొత్తం శాఖ అవసరాలకు సంబంధించి బడ్జెట్ నివేదిక సమర్పించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవి గుప్తా, డీ జీఅభిలాష్ బిస్త్, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
Tesla In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ శుభవార్త.. రాయలసీమకు టెస్లా కంపెనీ!