Site icon HashtagU Telugu

Half Day schools : ఈ నెల‌ 15 నుంచి తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు..

Telangana Schools To Run Ha

Telangana Schools To Run Ha

 

Half Day schools : తెలంగాణ(Telangana)లో ఎండ‌ల తీవ్ర‌త రోజు రోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 15 (శుక్ర‌వారం) నుంచి ఒంటిపూట బ‌డుల‌(Half Day schools)ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌(government), ప్రైవేటు(private), ఎయిడెట్(Aidet) స్కూళ్లల‌లో(schools) మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వ‌రకు ఒంటిపూట బ‌డులు కొన‌సాగ‌నున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రోజుల్లో పాఠ‌శాల‌లు ఉద‌యం 8 గంట‌ల నుంచే ప్రారంభం కానున్నాయి. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు పాఠాలు భోదించ‌నున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం పెట్టిన‌ అనంత‌రం విద్యార్థుల‌కు పంపాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఇక 10వ త‌ర‌గ‌తి ఎగ్జామ్స్ జ‌రిగే పాఠ‌శాల్లో మాత్రం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నిర్వ‌హిస్తారు. ఈ మేర‌కు పాఠ‌శాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు.

read also :PM Modi: జమ్ముకశ్మీర్ ప్రజలకు ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వేచ్ఛః ప్రధాని మోడీ 

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ విద్యాసంవత్సరం ముగిసే వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. 12.30 గంటలకే మధ్యాహ్న భోజనం పెట్టాలని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు.