Site icon HashtagU Telugu

TGSRTC : ఈ నెల 7న సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ..భారీ ఎత్తున కార్మికులతో కవాతు

Telangana RTC JAC calls for strike on 7th of this month.. Large scale march with workers

Telangana RTC JAC calls for strike on 7th of this month.. Large scale march with workers

TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (ఆర్టీసీ) ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఈ నెల 7వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మెకు మద్దతుగా, ఉద్యమాన్ని వేడెక్కించేందుకు కార్మికులు భారీగా కవాతు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఈ కవాతు సాగింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, వేతన సవరణలు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగ భద్రత, వంటి కీలక అంశాలను ప్రభుత్వం పలు మార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు సరైన స్పందన రాలేదని జేఏసీ చెబుతోంది. సంస్థల విలీనంతో వచ్చిన సమస్యలు ఇంకా పరిష్కార మార్గం దక్కకపోవడంతో, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Read Also: Ghee: ముఖానికి నెయ్యి రాసుకోవచ్చా.. రాసుకుంటే ఏమవుతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

జేఏసీ చైర్మన్ వెంకన్న మాట్లాడుతూ, “పలుమార్లు ప్రభుత్వం తలుపుతట్టినా స్పందన రాలేదు. చర్చలకు ఆహ్వానం ఇవ్వకపోవడం వలన మేము ఉద్యమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి ఎదురైంది,” అని తెలిపారు. సమ్మెకు ముందు దశగా కవాతును నిర్వహించామని, ఇది ప్రభుత్వానికి హెచ్చరికా bells లాంటిదని ఆయన పేర్కొన్నారు. కవాతులో పాల్గొన్న ఉద్యోగులు తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. “మా హక్కులు ఇవ్వండి”, “సమస్యలకు పరిష్కారం చూపండి”, “సమ్మెను తప్పించుకోండి , చర్చలకు రండి” అంటూ నినాదాలు చేశారు. కార్మికుల ఉత్సాహం, సంఘీభావం కవాతు అంతటా కనిపించింది.

ఇదిలా ఉంటే, కవాతు నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు. సమ్మెకు సంబంధించిన తదుపరి కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రకటించనున్నట్లు జేఏసీ వెల్లడించింది. యాజమాన్యం స్పందించకపోతే, ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కార్మికులు సన్నద్ధంగా ఉన్నారు.

Read Also: Bangalore : ఈనెల 9న ఒకే వేదికపై ఇద్దరు ముఖ్యమంత్రులు