Free Bus Effect : మహిళలకు ఫ్రీ జర్నీ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. డిసెంబరు 3తో పోలిస్తే డిసెంబరు 10న (ఆదివారం) 15 శాతం మేర రద్దీ ఎక్కువైంది. పెరిగిన రద్దీలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అయితే తెలంగాణలో రోజూ ఎంతమంది మహిళలు ఉచిత ప్రయాణ వసతిని వాడుకుంటున్నారనే లెక్కలు.. బస్సు కండక్టర్ల వద్ద ఉండే టికెట్ జారీ యంత్రాల్లో ‘జీరో టికెట్’ సాఫ్ట్‌వేర్(Free Bus Effect) అందుబాటులోకి వచ్చాక వెల్లడవుతుంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను రద్దు చేశారు. సంస్థ అవసరాలను తీర్చేందు కోసం విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇవాళ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ భారీగా ఉండొచ్చని ఆర్టీసీ అంచనా వేస్తోంది. దీంతో వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, రామప్ప వంటి శైవ క్షేత్రాలకు పెద్దసంఖ్యలో బస్సులను నడిపించాలని నిర్ణయించింది. సాధారణ రోజుల్లో బస్సులు 32 లక్షల కిలోమీటర్ల మేర నడుస్తుండగా.. సోమవారం రోజు 34 లక్షల కిలోమీటర్లు నడుస్తాయని చెబుతున్నారు. ఎక్కడి వరకు రద్దీ ఉంటే అక్కడివరకే నడిపేలా ‘కట్ ట్రిప్పుల’ను రన్ చేయాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. మహాలక్ష్మి పథకం ప్రకటించినప్పటి నుంచి బస్టాండ్‌లు మహిళా ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. వివిధ మార్గాల్లో గతంలో పల్లెవెలుగు బస్సుల్లో వెళ్లినవారు.. ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయంతో ఎక్స్‌ప్రెస్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎక్స్‌ప్రెస్‌లలోనూ రద్దీ పెరిగింది.