Site icon HashtagU Telugu

XBB15 Cases: బీ అలర్ట్.. తెలంగాణలో కరోనా ‘ఎక్స్ బీబీ15’ కేసులు

India Corona

India Corona

ఇతర దేశాల్లో కరోనా (Corona) వేవ్ కి కారణమైన కొవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ 15 కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3 కేసులను గుర్తించినట్టు హైదరాబాద్ లోని జన్యు ఆధారిత ప్రయోగశాల తెలిపింది. దేశంలో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో వెలుగు చూడగా, తాజాగా తెలంగాణలో కూడా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్–జనవరి 2 మధ్య దేశంలో ఆరు ఎక్స్ బీబీ 15 (XBB15 ) ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. తొలిసారి ఎక్స్ బీబీ 15 (XBB15 )ని న్యూయార్క్‌లో గుర్తించిన జేపీ వీలాండ్‌ సహా ఇతర జన్యు శాస్త్రవేత్తలు దీని గురించి చెబుతూ.. ఇది వైరస్ ను వేగంగా వ్యాప్తి చేసే వేరియంట్ అని, దీనివల్ల కరోనా వేవ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఎక్స్ బీబీ 15 (XBB15 ) అనేక ముఖ్యమైన ఉత్పరివర్తనాలను పొందడం వలన ఇది ఇప్పటి వరకు అత్యంత రోగనిరోధక శక్తి కలిగిన వేరియంట్ గా మారిందని చెబుతున్నారు. ఎక్స్ బీబీ 15 వల్ల అమెరికాలో చాలా మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారం వ్యవధిలోనే అమెరికాతో పాటు ఇంగ్లండ్ లో 40 శాతానికి పైగా కొవిడ్ వ్యాప్తికి ఈ వేరియంట్ కారణం అయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా కొత్త రకం వేరియేంట్స్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు (Harish Rao) వైద్యాధికారులను అలర్ట్ చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Also Read: Rashmika and Vijay: ముచ్చటగా మూడోసారి.. విజయ్ తో నటించేందుకు రష్మిక వెయిటింగ్!